White spots in nails: హఠాత్తుగా గోర్లమీద తెల్ల మచ్చలు ఏర్పడ్డాయా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్న నిపుణులు
White spots in nails: చేతి వేళ్ళ గోర్లు మన ఆరోగ్యానికి చిహ్నం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది గోర్లమీద చిన్న చిన్న తెల్లని మచ్చలు కనిపిస్తాయి..
White spots in nails: చేతి వేళ్ళ గోర్లు మన ఆరోగ్యానికి చిహ్నం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. అందుకనే గోర్లను చూసి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంటారు వైద్యులు. అలాగని ఏ ఇద్దరు వ్యక్తుల గోర్లు ఒకేలా ఉండవు. అయితే కొంతమంది గోర్లమీద చిన్న చిన్న తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా నెయిల్ పాలిష్ ని ఉపయోగించేవారికి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ మచ్చలు కొందరిలో సహజంగానే ఏర్పడతాయి. వీటిని వైద్య భాషలో ల్యూకోనైకియా అని అంటారు. ఇవి సహజసిద్ధంగా ఏర్పడిన మచ్చలు. మరికొందరిలో హఠాత్తుగా కనిపిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల వలన ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా గోర్లమీద మచ్చలు ముందుగా మన శరీరంలోని కొన్ని అవయవాల పనితీరుపై అనుమానించాల్సిన అవసరం ఉందని.. అంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం..
* కొంతమంది గొర్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ వంటి ఇన్ ఫెక్షన్లు వచ్చినా గోర్లపై తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంది. *కొంతమందిలో జింక్, కాల్షియం లోపం ఉన్నా గోర్లమీద మచ్చలు ఏర్పడతాయి. అప్పుడు జింక్, కాల్షియం అధికంగా ఉన్న ఆహారపదార్ధాలు తీసుకుంటే మచ్చలు తగ్గుతాయి. *కొంతమందిలో గోర్లమీద ఇలా మచ్చలు కనిపిస్తే.. దానికి కారణం గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు. *అంతేకాదు నోటి దుర్వాసన, న్యూమోనియా, సోరియాసిస్ వంటి వ్యాధులకు గుర్తు ఈ గోర్లమీద మచ్చలని వైద్యులు సూచిస్తున్నారు. *గోర్లుమీద తెలుపు మచ్చలు కనిపిస్తే.. జీర్ణశయాంతర అంటు వ్యాధులు, అజీర్ణము, ఇతర అనారోగ్య లోపాలు సహా అనేక వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. *ఒకొక్కసారి గోర్ల మీద మచ్చలు ప్రోటీన్ లోపంవలన కూడా ఏర్పడతాయి. జుట్టు ఊడిపోతుంది. రోగనిరోధక శక్తి రక్త తగ్గుతుంది. గోర్లు పెలుసుగా మారతాయి. *కొంతమందిలో ఆర్సెనిక్ పాయిజనింగ్ అయినా అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అయితే ఇలా గోర్ల మీద మచ్చలు పెద్దగా.. ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెబుతున్నారు.
Also Read: వరదనీటిలో తడవకుండా యువకుడి అద్భుత ఆలోచన .. వాట్ ఆన్ ఐడియా సర్ జీ అంటూ నెటిజన్లు ఫిదా..