White Spots: శరీరంపై తెల్ల మచ్చలు అవుతున్నాయా.. దానికి కారణం ఏమిటో తెలుసా..

చాలామంది పిల్లలకు శరీరంపై తెల్లమచ్చలు వస్తుంటాయి. చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి కూడా తెల్లమచ్చలు అవుతుంటాయి....

White Spots: శరీరంపై తెల్ల మచ్చలు అవుతున్నాయా.. దానికి కారణం ఏమిటో తెలుసా..

Updated on: Jan 21, 2022 | 6:18 PM

చాలామంది పిల్లలకు శరీరంపై తెల్లమచ్చలు వస్తుంటాయి. చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి కూడా తెల్లమచ్చలు అవుతుంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఇవి ముఖం, చేతులపై ఏర్పడుతుంటాయి. అయితే ఈ తెల్లమచ్చలు రావడానికి రెండు కారణాలు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఒకటి హైపో పిగ్మెంట్ ప్యాచెస్, రెండోది డీ పిగ్మెంటెడ్ ప్యాచెస్​. హైపో పిగ్మెంట్ ప్యాచెస్ అంటే మన శరీరం రంగు కన్నా తక్కువ రంగులో మచ్చలు వస్తుంటాయి.
ఆ ప్రాంతంలో మెలెనోసైట్ తగ్గడం వల్ల ఈ మచ్చలు వస్తాయి. మెలెనోసైట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో డీ పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తుంటాయి. సన్​లైట్ లేదా యూవీ లైట్​ అలర్జీలు ఉంటే కూడా మచ్చలు వస్తుంటాయి. ఒక్కోసారి పోషకాహార లోపం వల్ల కూడా తెల్లమచ్చలు ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా శరీరంపై తెల్లమచ్చలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా చర్మవైద్యుడి దగ్గరకు వెళ్లి.. చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Read Also..  Winter Care Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పక ఉండాల్సిందే..!