White Onion: తెల్ల ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వాడటం ఇప్పుడే మొదలుపెడతారు..!

|

Dec 23, 2022 | 2:46 PM

తెల్ల ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా కంటికి, చెవికి, ముక్కుకు ఇన్ఫెక్షన్ ఉంటే తెల్ల ఉల్లిపాయను తీసుకుంటే నయమవుతుంది.

White Onion: తెల్ల ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..  వాడటం ఇప్పుడే మొదలుపెడతారు..!
White Onion
Follow us on

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. అలాంటి ఉల్లి రెండు రంగుల్లో దొరుకుతుంది. అందులో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయ ప్రతి ఒక్కరి ఇళ్లలో లభిస్తుంది. కూరగాయల నుండి సలాడ్‌ల వరకు ప్రతిదానిలో ఎర్ర ఉల్లిపాయలను తీసుకుంటారు. అయితే మీకు తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా..? తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు కూడా ఈరోజు నుండి తెల్ల ఉల్లిపాయను వాడడం ఖాయం. ఎందుకంటే తెల్ల ఉల్లిపాయలు పోషకాలతో నిండి ఉన్నాయి. ఈ ఉల్లిపాయల్లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి, తెల్ల ఉల్లిపాయల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తెల్ల ఉల్లిపాయలు మీ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెలా రాసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నెల పాటు నిరంతరం చేస్తే జుట్టు రాలడం నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. చలికాలంలో ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం జరుగుతుంది. దీని వల్ల చాలా మంది మహిళలు చిరాకుగా ఉంటారు. అయితే తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తెల్ల ఉల్లిపాయల రసాన్ని తేనెతో కలిపి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. దీనితో పాటు తెల్ల ఉల్లిని తింటే ఉదర వ్యాధులు కూడా నయమవుతాయి.

తెల్ల ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. మరోవైపు, సల్ఫర్, ఫ్లేవనాయిడ్ యాంటీ-ఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. ఈ ఉల్లిపాయ తింటే సగం జబ్బులు నయమవుతాయి. తెల్ల ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా కంటికి, చెవికి, ముక్కుకు ఇన్ఫెక్షన్ ఉంటే తెల్ల ఉల్లిపాయను తీసుకుంటే నయమవుతుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు నుండి తెల్ల ఉల్లిపాయలను తినడం ప్రారంభించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి