Borderline Diabetes: డయాబెటీస్‌కు ముందుగా కనిపించే లక్షణాలేమిటో మీకు తెలుసా..? అయితే ఇక్కడ తెలుసుకోండి..

|

Dec 31, 2022 | 3:31 PM

డయాబెటీస్ అనేది చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా అందరీలోనూ కనిసిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ప్రపంచంలోని..

Borderline Diabetes: డయాబెటీస్‌కు ముందుగా కనిపించే లక్షణాలేమిటో మీకు తెలుసా..? అయితే ఇక్కడ తెలుసుకోండి..
Diabetes Diet
Follow us on

ప్రస్తుతం మానవుడు అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అతను అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చిన్న వయసులోనే చాలా మంది పిల్లలు బీపీ,  డయాబెటీస్, అల్సర్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ అనేది చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా అందరీలోనూ కనిసిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటీస్‌కు ముందుగానే డయాబెటీస్ లక్షణాలు మన శరీరంలో కనిపించడం ప్రారంభమవుతాయి. దీనినే వైద్య భాషలో బోర్డర్ లైన్ డయాబెటీస్ లేదా ప్రీడయాబెటిస్ అని అంటారు.

అయితే ఈ దశలో శరీర రక్తంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చక్కెర ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం జీవన విధానంలో, ఇంకా ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకపోతే ప్రీడయాబెటీస్ లక్షణాలు ఉన్నవారిలో దాదాపు  15-30 శాతం మంది రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో మధుమేహం(డయాబెటీస్) బారిన పడవచ్చు. ప్రీ-డయాబెటిస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలు మన శరీరంలో డయాబెటీస్‌కు ముందుగానే కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలు ఏమిటో  తెలుసుకుందాం..

సరిహద్దు మధుమేహం యొక్క లక్షణాలు ఏమిటి?

  1. బోర్డర్‌లైన్ డయాబెటిస్‌లో చాలా మంది వ్యక్తులు తమ శరీరంలో ఒకే రకమైన లక్షణాలను ఎదుర్కోరు. అయితే ఎక్కువ మంది దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు.
  2. కొన్నిసార్లు తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. బోర్డర్‌లైన్ డయాబెటిస్ ఉండటం వల్ల శరీరం మరింత అలసిపోయి బలహీనంగా అనిపిస్తుంది. అలసట కారణంగా, ఏ పనిలోనైనా ఏకాగ్రత సాధించడం కష్టమవుతుంది.
  5. అకస్మాత్తుగా పెరిగిన బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా బోర్డర్‌లైన్ డయాబెటీస్ లక్షణాలుగానే పరిగణనలో ఉంటాయి. వీటి కారణంగా మైకము, అలసట, అధిక కోపం, చెమట వంటి సమస్యలు ఎదురవుతాయి.
  6. ఆరోగ్య నిపుణుల ప్రకారం, బోర్డర్‌లైన్ డయాబెటీస్ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. కానీ పాదాలలో వచ్చే మార్పులను బట్టి గుర్తించవచ్చు. చాలా సందర్భాలలో పాదాల నొప్పి, జలదరింపు, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.