Boiled Egg Diet: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా ఎలా తీసుకోవాలంటే..

|

Oct 28, 2021 | 12:22 PM

Boiled Egg Diet: గుడ్లు సంపూర్ణ పోషకారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గుడ్లు రోజువారీ డైట్ లో ఆహారంగా తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఉడక బెట్టిన..

Boiled Egg Diet: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా ఎలా తీసుకోవాలంటే..
Boiled Egg Diet
Follow us on

Boiled Egg Diet: గుడ్లు సంపూర్ణ పోషకారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గుడ్లు రోజువారీ డైట్ లో ఆహారంగా తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఉడక బెట్టిన గుడ్లు బరువు తగ్గడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  గుడ్లలో ఆరోగ్యాన్నిచ్చే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. అయితే ఎక్కువ మొత్తంలో ఉడక బెట్టిన గుడ్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్‌ ను ఇస్తుందని.. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉడికించిన గుడ్లను ఆహారంగా రోజుకు 2 లేదా మూడు కంటే ఎక్కువ తినవద్దని సూచిస్తున్నారు.

గుడ్లు నిజానికి మనిసిని బలవర్ధకమైన ఆహారం. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వును అందించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ తినే ఆహారం  సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.  రోజూ తినే ఆహారంలో 2-3 గుడ్లు చేర్చుకోవాలని అప్పుడు  శరీరం బరువు తగ్గడం, జీవక్రియ రేటు సక్రమంగా ఉంచడం వంటి పనులు చేస్తుంది. అంతేకాదు ఆకలిని అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

అధికంగా గుడ్లు తినేవారి ఆరోగ్యంపై  అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మూడు నెలలు రోజు ఆహారంగా గుడ్డును తీసుకునేవారిని పరిశీలించగా.. రక్తంలో లిపిడ్ స్థాయిల్లో ఎటువంటి మార్పులను  చోటుచేసుకోలేదు. దీంతో తక్కువ మొత్తంలో గుడ్లు తింటే వేగంగా బరువు తగ్గుతారు.  అందువలన రోజుకు ఉడికించిన రెండు లేదా మూడు గుడ్లను తినే ఆహారంలో జత చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు, ఆకూ కూరల్లో జత చేసి ఉడికించిన గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

Also Read : అచ్చం మన దేశంలోలానే.. ఆ విదేశాల్లోనూ అంబరాన్ని అంటేలా దీపావళి వేడుక సంబరాలు