Health Tips: ఆహారంలో ఈ ఒక్కటి తగ్గిస్తే.. నూరేళ్లు హాయిగా బతకొచ్చు!

| Edited By: Ravi Kiran

Jan 17, 2024 | 7:40 AM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వాకింగ్, వర్కవుట్, యోగా వంటి శారీరక శ్రమలతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా పోషకాహారాలు తక్కువగా తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అందుకే సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన, కారం-ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానేయాలని తరచూ నిపుణులు చెబుతుంటారు..

Health Tips: ఆహారంలో ఈ ఒక్కటి తగ్గిస్తే.. నూరేళ్లు హాయిగా బతకొచ్చు!
Salt Side Effects
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వాకింగ్, వర్కవుట్, యోగా వంటి శారీరక శ్రమలతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా పోషకాహారాలు తక్కువగా తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అందుకే సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన, కారం-ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానేయాలని తరచూ నిపుణులు చెబుతుంటారు. కారం, మసాలా దినుసులు ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి లేకుండా కూడా వంటలు చేయవచ్చు. కానీ ఆహారంలో ఉప్పు లేకపోతే మొత్తం రుచి చెడిపోతుంది. అందుకే చాలా మంది ఆహారంలో ఉప్పు అధికంగా వినియోగిస్తుంటారు. ఉప్పు ఎక్కువగా తినే వారు ఈ అలవాటును మానేయాలి. లేకుంటే అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఉప్పును సరైన పరిమాణంలో కలపకపోతే, అది ఆహారం రుచిని పాడుచేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. పోషకాహార నిపుణురాలు సోనియా బక్షి ఏం చెబుతున్నారంటే.. ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలుపుకోవడం జరగదు. ఫలితంగా అనేక ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. సోడియం క్లోరైడ్ రూపంలో ఉప్పు ఉంటుంది. శరీరంలో అధిక మొత్తంలో సోడియం తీసుకుంటే అది ఎముకలకు హాని కలిగిస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయి. ఈ సమస్యను బోలు ఎముకల వ్యాధి అని పిలుస్తారు. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారికి చిన్న గాయం తగినా పగుళ్లకు దారితీస్తుంది.

రక్తపోటు సమస్య

శరీరంలో సోడియం పరిమాణం పెరగడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య వస్తుంది. అంటే అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వాస్తవానికి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె, మూత్రపిండాలకు హానితలపెడుతుంది. కాబట్టి, ఆహారంలో ఉప్పు పరిమాణం పరిమితంగా ఉండాలి.

ఒక రోజులో సగటున ఎంత ఉప్పు తీసుకోవాలి?

వయోజన వ్యక్తి ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక టీస్పూన్‌కు సమానం. నిజానికి మనం ఇంటి ఆహారమే కాకుండా ఫాస్ట్‌ఫుడ్‌, క్యాన్‌డ్‌ ఫుడ్‌, స్నాక్స్‌ వంటి వాటిని కూడా తింటుంటాం. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తినకుండా ఉండాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.