Salt Effect: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతన్నాయి. తినే ఆహారం కారణంగా కూడా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక మనం ప్రతినిత్యం వంటకాల్లో వాడేది ఉప్పు. చాలా మంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికి రాదు. ఏ వంటకంలో అయినా సరే.. ఉప్పు తగినంత పడాల్సిందే. అయితే ఉప్పు తగినంత తింటే మన ఆరోగ్యానికి ఏమీ కాదు. కానీ ఉప్పు మోతాదు మించితే మాత్రం మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. బీపీ, గుండెపోటు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం మనం తగినంత మోతాదు కన్నా ఎక్కువ ఉప్పు తింటే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంటుంది. వాటిని బట్టి మనం ఉప్పు ఎక్కువగా తింటున్నామని తెలుసుకోవాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు తగ్గించాలి.
ఉప్పు ఎక్కువగా తింటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన:
ఉప్పు ఎక్కువగా తింటే రోజులో మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. ఉప్పులో ఉండే సోడియంను శరీరం బయటకు పంపేందుకు నీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. అందుకే మనకు తరచూ మూత్రం వస్తుంది. మీకు గనక డయాబెటిస్ లేనట్లయితే, మూత్ర విసర్జనఎక్కువగా అవుతున్నట్లయితే.. అప్పుడు మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకుంటే మంచి. లేకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
శరీరంలో వాపులు..
ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో వాపులు వస్తాయి. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బుతుంది. అక్కడ వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది. దానికి కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తినేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీన్నే ఎడిమా అని కూడా అంటారు. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోతుంది..
ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో నీరు త్వరగా అయిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా ఈ వేసవిలో శరీరం సహజంగానే డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇక ఉప్పు అధికంగా తింటే త్వరగా డీహైడ్రేషన్ బారిన పడి, తద్వారా ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఉప్పు తగ్గిస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
ఇవి కూడా చదవండి: