
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నడక చాలా ముఖ్యం. ప్రతిరోజూ కొన్ని గంటలు నడిస్తే..ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఓ హెల్త్ డివైజ్ ప్రకారం రోజుకు పదివేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిన్న ప్రచారం ఊపందుకుంది. కోవిడ్ తర్వాత చాలా మంది ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ద చూపిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం చేస్తున్న వ్యాయామ పద్దతుల్లో నడక ఎంతవరకూ మన సపోర్టుగా ఉంటుందనేది తెలియాలి. ఇందులో రోజుల అసలు ఎన్ని అడుగులు వేయాలి అనేది చాలా ముఖ్యం. అనేక రకాల అనారోగ్య సమస్యలకు శారీరక శ్రమ లేకపోవడమే కారణమని చెబుతుంటారు వైద్యులు. అసలు రోజుకు పదివేల అడుగులు నడవడం అనేది చాలా మంది కోవిడ్ సమయంలో ఇంటి పనిచేస్తున్నప్పుడు మొదలైంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది.
చాలా మంది బరువును తగ్గించుకునేందుకు నడకను ఎంచుకుంటారు. ఫిట్ గా ఉండేందుకు కూడా నడకనే ఎంచుకుంటారు. అయితే రోజుకు పదివేల అడుగులు వేస్తే మనకు ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకుందాం.
రోజుకు 10వేల అడుగులు:
10,000 అడుగులు నడవడం వల్ల హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు చిత్తవైకల్యం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు సూచించాయి. రోజూ 10,000 అడుగులు నడవాలనే లక్ష్యాన్ని సాధించడం ఫిట్‌నెస్ ఔత్సాహికుల ప్రచారం ఊపందుకుంది. దాని కంటే తక్కువ దశలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ 3,800 అడుగులు వేయడం వల్ల అభిజ్ఞా క్షీణతను 25% తగ్గించవచ్చు. మరొక ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ తక్కువ అడుగులు వేసే వారి కంటే రోజుకు 7,000 అడుగులు వేసే వ్యక్తులు ముందస్తు మరణానికి గురవుతారని వెల్లడించింది. అయితే, నిశ్చల జీవనశైలి కారణంగా, చాలా మంది 5వేలు లేదా 7లు సాధించడానికి కష్టపడతారు. ఫిట్‌నెస్ నిపుణులు వారి రోజువారీ కార్యకలాపాల స్థాయిని బట్టి రోజుకు ఎన్ని స్టెప్పులు నడవాలో నిర్ణయించుకోవాలి.
నడక ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది:
రోజూ నడక అనేది నిద్ర, రక్తపోటును మెరుగుపరుస్తుంది. బలమైన గుండె తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. నడక వల్ల మరింత చురుకుగా మారుతుంది. అంతే కాకుండా సిస్టోలిక్ రక్తపోటు సగటున 9 పాయింట్ల వరకు తగ్గుతుంది. నడక రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడంతోపాటు కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ని ఉపయోగించుకునేలా చేస్తాయి. నడక రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. నడక గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుందని లెక్కలేనని అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
దీర్ఘకాలిక రోగులకూ నడక ఎంతో మంచిది:
నడక మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రతిరోజూ నడక వల్ల చాలా ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. దీనికి సౌకర్యవంతమైన పాదరక్షలను ఉపయోగించడం మంచిది.
– ప్రతి 30 నిమిషాలకు కేవలం 5 నిమిషాలు నడిచేలా మీ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేయండి.
– మీరు టీవీ చూస్తూ, చదువుతున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు నడుస్తూ కూడా చేయవచ్చు.
– మీకు ట్రెడ్‌మిల్ లేదా క్రాస్ ట్రైనర్ ఉంటే, మీరు దానిని మీ వర్క్‌స్టేషన్‌కు సమీపంలో ఉంచవచ్చు, ఇక్కడ మీరు ప్రతి 30 నిమిషాలకు ఉపయోగించవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం