Heart Attack Risk: చిన్న వయసులో కూడా గుండెపోటు రావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

|

Nov 26, 2022 | 9:35 PM

వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చంటున్నారు వైద్య ..

Heart Attack Risk: చిన్న వయసులో కూడా గుండెపోటు రావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Heart Attack
Follow us on

వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇది ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళలు ఈ గుండె జబ్బుల బారిన పడి మరణానికి చేరువవుతున్నారు పూర్వ కాలంలో నడివయస్కులు, వృద్ధులు కరోనరీ వ్యాధి బారిన పడేవారని, అయితే మారుతున్న కాలంతో పాటు యువతలో కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. దీనిని నివారించడం చాలా ముఖ్యం.

గుండె జబ్బుతో మరణించే ప్రమాదం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కరోనరీ అనేది ఆర్టరీ వ్యాధి. గుండెపోటు, అధిక రక్తపోటు 45 శాతం నాన్-కమ్యూనికేబుల్ వ్యాధి సంబంధిత మరణాలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో 22 శాతం మంది శ్వాసకోశ వ్యాధులతో 12 శాతం మంది క్యాన్సర్‌తో, 3 శాతం మంది మధుమేహంతో మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

సత్వర చర్యతో గుండె జబ్బుల నివారణ..

సత్వరమే చర్యలు తీసుకుంటే చిన్న వయసులో వచ్చే గుండెపోటుల్లో 80 శాతం అరికట్టవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన బరువు, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం వంటివి చిన్న వయస్సులోనే ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇలా చిన్న వయసు నుంచే గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే జీవన శైలి కారణంగా కూడా రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయని, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..