Health: కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ను వైద్యశాస్త్ర వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అల్లోపతి వైద్య విధానాన్ని బాబా రాందేవ్ కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. అలాగే రాందేవ్ బాబా వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. ఆయన అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏమైనా ఉందా.? అని ప్రశ్నించింది. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాందేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న విషయం కూడా విధితమే. ఇదిలా ఉంటే హోమియోపతి, అల్లోపతి వైద్యాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందా.? చికిత్స తీసుకునే విషయంలో రోగులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.? లాంటి అంశాలపై ముంబైలోని వోక్‌హార్డ్ హాస్పిటల్‌కు చెందిన మెడిసిన్ హెడ్ డాక్టర్ బెహ్రామ్ పర్ధివాలా పలు విషయాలను టీవీ9తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విషయాలు వారి మాటల్లోనే..
రోగాన్ని నయం చేయడానికి అల్లోపతి విధానాన్ని పాటించాలా, హోమియోపతి విధానాన్ని పాటించాలా అన్న సందిగ్థత ఎప్పటి నుంచో ఉంది. ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో రెండు విధానాలను పాటించడం రోగి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు. చాలా మంది అలోపతి వైద్యులు ప్రత్యామ్నాయ వైద్య విధానం ఉండదనే భావనలో ఉంటారు. అయితే కొన్ని ఆయుర్వేద ఔషధాలలో లోహలను గుర్తించిన సందర్భాలు సైతం ఉన్నాయి. అల్లోపతికి ప్రత్యామ్నాయ చికిత్స కోవిడ్ 19 వంటి వ్యాధులను నయం చేయగలదని వాదిస్తున్న నేపథ్యంలో ఇది మనిషి జీవితానికి సంబంధించిన విషయమని గుర్తించాలి.
అల్లోపతి ద్వారా మాత్రమే నయమయ్యే కొన్ని వ్యాధులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఆయుర్వేదం లేదా మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు పనిచేయవనే విషయాన్ని రోగి గుర్తించాలి. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను ప్రతీ దానిని నమ్ముతాడు. అయితే వైద్యం కోసం ఎంచుకుంటున్న మార్గాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఔషధాల్లో అలోపతి మెడిసన్ ఉన్నట్లు మా పరిశోధనల్లో తేలింది.
ఇదే విషయమై ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ కుశాల్ బెనర్జీ మాట్లాడుతూ.. హోమియోపతి, అలోపతి చికిత్సలను కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అయితే ఈ విషయంలో రోగి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది రోగులు తాము ఏ వైద్య విధానంలో చికిత్స తీసుకుంటున్నామో వైద్యులకు తెలపరు. వైద్యుడు తనకు తెలిసిన హద్దులకు కట్టుబడి ఉండాలి. హోమియో వైద్యుడు తన ఫీల్డ్ గురించి మాత్రమే మాట్లాడాలి, అలోపతికి అతని వైద్య శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది.
అయితే వీరిద్దరూ కలిసి ఒక రోగికి చికిత్స అందించగలరు అని కుశాల్ వివరించారు. రెండు వైద్య విధానాలను ఇష్టారాజ్యంగా పాటించడం కూడా ప్రమాదకరం. చాలా సందర్భాల్లో ఒక రోగి కొన్ని వారాల పాటు అల్లోపతి చికిత్స తీసుకుంటాడు, అది పని చేయకపోయే సరికి హోమియోపతికి వెళతాడు. అది కూడా పనిచేయకపోతే మళ్లీ అల్లోపతి చికిత్స తీసుకుంటాడు. దీంతో వ్యాధి నియంత్రణ కఠినతరంగా మారే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..