Egg Yolk for Hair: జుట్టుకి కోడిగుడ్డు సొన రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి?

|

Aug 20, 2023 | 2:04 PM

కోడిగుడ్డు.. తక్కువ ఖర్చుతో.. సులభంగా తినగలిగే ఆహారం. గుడ్డులో ప్రొటీన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. గుడ్డును కేవలం తినేందుకే కాదు.. జుట్టు సంరక్షణ కోసం కూడా వాడుతుంటారు. కోడిగుడ్డులోని తెల్లసొననే జుట్టుకు వాడుతుంటారు. కానీ దానిలో ఉండే పచ్చసొన వల్ల కూడా జుట్టుకు ప్రయోజనాలుంటాయి. గుడ్డులో ఉండే పోషకాలు, బయోటిన్, బి కాంప్లెక్స్, విటమిన్లు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేసి కొత్తజుట్టు పెరిగేందుకు సహాయపడుతాయి. ఒక్కోసారి జుట్టు మధ్యలోకి విరిగిపోయి తెగిపోతుంటుంది. జుట్టు చివర్లలో చిట్లిపోయి..

Egg Yolk for Hair: జుట్టుకి కోడిగుడ్డు సొన రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
eggs
Follow us on

కోడిగుడ్డు.. తక్కువ ఖర్చుతో.. సులభంగా తినగలిగే ఆహారం. గుడ్డులో ప్రొటీన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. గుడ్డును కేవలం తినేందుకే కాదు.. జుట్టు సంరక్షణ కోసం కూడా వాడుతుంటారు. కోడిగుడ్డులోని తెల్లసొననే జుట్టుకు వాడుతుంటారు. కానీ దానిలో ఉండే పచ్చసొన వల్ల కూడా జుట్టుకు ప్రయోజనాలుంటాయి. గుడ్డులో ఉండే పోషకాలు, బయోటిన్, బి కాంప్లెక్స్, విటమిన్లు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేసి కొత్తజుట్టు పెరిగేందుకు సహాయపడుతాయి. ఒక్కోసారి జుట్టు మధ్యలోకి విరిగిపోయి తెగిపోతుంటుంది. జుట్టు చివర్లలో చిట్లిపోయి.. జుట్టు పెరగడం ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలకు కోడిగుడ్డులో ఉండే పచ్చసొన సమర్థవంతంగా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనలో ఉండే లుటిన్ జుట్టును దృఢంగా చేసి.. తెగిపోకుండా కాపాడుతుంది.

జుట్టు సిల్కీగా, పొడవుగా, ఒత్తుగా ఉంటే సరిపోదు. జుట్టు ప్రకాశవంతంగా ఉంటేనే అందం. అలా ఉండటం అవసరం కూడా. జుట్టు మెరుస్తూ ఉంటే.. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మెరిసే జుట్టుకోసం బ్యూటీపార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసే బదులు.. కోడిగుడ్డునే జుట్టుకు రాసుకుంటే.. సహజంగానే సమస్య పరిష్కారమవుతుంది. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రొటీన్ ఆరోగ్యకరమైన షైన్ ని పెంచుతుంది. వారానికి ఒకసారి.. వీలైతే రెండుసార్లు తెల్లసొనను జుట్టుకు రాసి.. అరగంట తర్వాత తల స్నానం చేస్తే.. షైనింగ్ గా ఉండటంతో పాటు కురులు మరింత మృదువుగా ఉంటాయి.

కోడిగుడ్డులో ప్రోటీన్లు:

ఇవి కూడా చదవండి

కోడిగుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్ తో పాటు నియాసిన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉంటాయి. జిడ్డుగల జుట్టు ఉన్నవారు కోడిగుడ్డులో ఉన్న గుడ్డులోని తెల్లసొన రాసుకోవాలి. అలాగే డ్రై హెయిర్ ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొన రాసుకోవాలి. గుడ్డు పచ్చసొనలోనూ ప్రొటీన్ ఉంటుంది. అలాగే బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఉన్న కొవ్వు జుట్టును కండిషన్ చేస్తుంది. కోడిగుడ్డు మొత్తాన్ని జుట్టుకు ఉపయోగించినా మంచి ఫలితాలుంటాయి.

జుట్టు పొడవుగా పెరగాలంటే ఇలా చేయాలి:

ఆలీవ్ ఆయిల్: మీది ఆయిలీ హెయిర్ అయితే.. 2 కోడిగుడ్లలోని తెల్లసొన, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. 20 నిమిషాలపాటు ఆరనిచ్చి.. తలస్నానం చేయాలి. ఇలా రాసుకోవడం వల్ల ఆయిలీ హెయిర్ తగ్గుతుంది. అలాగే.. జుట్టు మృదువుగా ఉండటంతో పాటు కొత్తజుట్టు పెరిగి.. జుట్టు ఒత్తుగా ఉంటుంది.

పొడిజుట్టు ఉన్నవారు 2 కోడిగుడ్లలో పచ్చసొన తీసుకుని.. అందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాయాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా అవ్వడంతో పాటు షైనింగ్ గా కూడా ఉంటుంది. కొత్తజుట్టు పెరిగి.. జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటుంది.

ఉల్లి రసం: ఒక గిన్నెలో 2 కోడిగుడ్లలోని సొన, ఒక చెంచా ఉల్లిపాయ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసి.. 30 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీరు, షాంపూలతో కడిగేసుకోవాలి. అనంతరం హెయిర్ కు కండిషనర్ అప్లై చేయాలి. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టులోని ఫోలికల్స్ ను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి