Mustard Oil: ఈ రోజుల్లో బరువు పెరగడం, పొట్ట పెరగడం చాలా మందికి సమస్యగా మారింది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడ్డ అలవాట్లు కారణంగా అధిక బరువు సమస్య ఏర్పుడుతుంది. బరువు పెరగడం సులభం కానీ తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రజలు చాలా వ్యాయామం చేస్తారు. కచ్చితమైన డైట్ పాటిస్తారు. అయినా బరువు తగ్గలేకపోతారు. మీరు బరువు త్వరగా తగ్గాలంటే ఆహారంలో ఈ నూనెని ఉపయోగిస్తే చాలు. బరువు తగ్గించడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఆవాల నూనె ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలని కలిగి ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ గుండెకు చాలా మంచిదని భావిస్తారు. ఇది కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
ఆవనూనెలో క్యాన్సర్‌ని తగ్గించే గుణాలు ఉంటాయి. ఈ భాగాలు కొలొరెక్టల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వంటి క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ ఆవనూనెతో నొప్పి ఉన్న కీళ్లను మసాజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది. ఆవాల నూనెలో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆవాల నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. ఆవాల నూనెతో పిల్లకు మసాజ్ చేస్తే వారి ఎముకలు దృఢంగా మారుతాయి. జుట్టు పోషణలో అద్భుతంగా పని చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆవాల నూనెతో మసాజ్ చేయడం ద్వారా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. అందుకే డైట్‌లో కచ్చితంగా ఆవాల నూనెని చేర్చుకోవాలి.