Health News: బలహీనంగా ఉన్నారని ఫీలవుతున్నారా.. పాలలో ఇవి కలుపుకొని తాగితే చాలు..!

|

Mar 27, 2022 | 5:48 AM

Health News: ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ కొంతమంది సన్నగా ఉండి, బలహీనతతో ఇబ్బందిపడుతున్నారు. సన్నగా ఉంటే అది అనారోగ్యానికి సంకేతం.

Health News: బలహీనంగా ఉన్నారని ఫీలవుతున్నారా.. పాలలో ఇవి కలుపుకొని తాగితే చాలు..!
Banana And Milk
Follow us on

Health News: ఆధునిక కాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ కొంతమంది సన్నగా ఉండి, బలహీనతతో ఇబ్బందిపడుతున్నారు. సన్నగా ఉంటే అది అనారోగ్యానికి సంకేతం. అలాంటి వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కవగా ఉంటుంది. శరీరం త్వరగా వ్యాధులకు గురవుతుంది. సన్నగా ఉన్నవారు తమ వ్యక్తిత్వం గురించి ఆందోళన చెందుతారు. అందుకే లావుగా మారడానికి బరువు పెరగడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి వారు పాలలో ఈ పదార్థాలు కలుపుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అందులో మొదటిది పాలు, అరటిపండు మిక్స్‌. మీరు బరువు పెరగాలంటే ఖచ్చితంగా పాలలో అరటిపండు మిక్స్‌ చేసుకొని తినాలి. ఇవికాకుండా రోజుకు 3 నుంచి 4 అరటిపండ్లు తినాలి. అరటిపండు షేక్ తాగాలి. ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ధృడంగా తయారుచేస్తుంది.

పాలు, తేనె- మీరు ప్రతిరోజూ పాలలో తేనె కలిపి తాగితే త్వరగా బరువు పెరుగుతారు. అల్పాహారం తినే సమయంలో లేదా రాత్రి నిద్రిస్తున్నప్పుడు పాలలో తేనె కలిపి తాగాలి.

పాలు, డ్రై ఫ్రూట్స్- బరువు పెరగాలంటే పాలలో డ్రై ఫ్రూట్స్‌ కలుపుకొని తాగాలి. 3 నుంచి 4 బాదం, ఖర్జూరం, అంజీర పండ్లను పాలలో వేసి మరిగించి తాగితే బరువు పెరుగుతారు. రాత్రి పడుకునే ముందు పొడి పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.

పాలు, గంజి- తీపి పాలలో గంజి కలుపుకొని తాగడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాదు మిల్క్ ఓట్స్ కూడా తినవచ్చు. అల్పాహారంలో ఓట్ మీల్ తినడం వల్ల బరువు పెరుగుతారు.

పాలు, ఎండుద్రాక్ష- ఎండు ద్రాక్ష మనిషిని ధృడంగా చేస్తుంది. 10 గ్రాముల ఎండుద్రాక్షను పాలలో నానబెట్టండి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను మరిగించి తాగాలి. కావలసినంత శక్తి లభిస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

Anil Ambani Resigns: రిలయన్స్‌ పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డు పదవులకు అనిల్‌ అంబానీ రాజీనామా..