Weight Lose: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇవి పాటించండి చాలు..

| Edited By: Ravi Kiran

Nov 07, 2021 | 8:07 AM

ప్రస్తుతం ఉన్న జీవనవిధానంలో చాలా మంది బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చిన్న వయస్సులో ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గుంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని పనులు క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు...

Weight Lose: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇవి పాటించండి చాలు..
Foods
Follow us on

ప్రస్తుతం ఉన్న జీవనవిధానంలో చాలా మంది బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చిన్న వయస్సులో ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గుంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని పనులు క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పనులు ఏమిటే ఇప్పుడు చూద్దాం..

ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, దీర్ఘకాలిక ఆహార ప్రణాళికను రూపొందించేటప్పుడు కూడా భాగం నియంత్రణను అభ్యసించాలి. ముఖ్యంగా కొవ్వు ఎక్కువ ఉన్న పదార్థలు తీసుకొవద్దు. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అయిల్ ఫుడ్ చాలా తక్కువ మొతాదులో తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు తప్పకుండా నియంత్రణ ఉండాలి. లేకుంటే ఇష్టమొచ్చినట్లు తింటే లావైపోతాం.

వ్యాయామం
బరువు తగ్గడానికి బలమైన జీవక్రియ కీలకం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం శరీరానికి మంచిది. “రెగ్యులర్ వ్యాయామం వల్ల మీరు కొన్ని అదనపు కేలరీలను ఖర్చు చేస్తారు. జీవక్రియను పెంచడంలో వ్యాయామం సహాయపడుతుంది. రోజుకు కనీసం 25 నుండి 35 నిమిషాలు వ్యాయామం చేయాలి.

తగినంత నిద్ర పొందండి
మనిషికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. దాదాపు 8-9 గంటలు నిద్రపోవాలి. సరిపడా నిద్రపోని వారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. “తగినంత నిద్ర లేకుంటే పాక్షికంగా గ్రెలిన్ అధిక స్థాయికి వెళ్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది ఎందుకంటే ఇది ఆకలి హార్మోన్.

ఒత్తిడిని తగ్గించుకోవాలి
మీరు నిరంతరం ఒత్తిడికి లోనయ్యే వ్యక్తి అయితే, మీరు మీ బరువు తగ్గలేరు. ఒత్తిడికి గరైతే విడుదలయ్యే హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో బరువు పెరగే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయాలి.

Read Also.. అతిగా నిద్రపోతున్నారా? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి..

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!