Vitamin K: విటమిన్ కె ఆ జబ్బును అడ్డుకుంటుంది.. ఆరోగ్యానికి కె విటమిన్ చేసే మేలు ఏమిటంటే..

మీరు ధమనులలో కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించాలనుకుంటే, ఆహారంలో విటమిన్-కె మొత్తాన్నిపెంచండి.

Vitamin K: విటమిన్ కె ఆ జబ్బును అడ్డుకుంటుంది.. ఆరోగ్యానికి కె విటమిన్ చేసే మేలు ఏమిటంటే..
Vitamin K
Follow us

|

Updated on: Aug 17, 2021 | 9:12 PM

Vitamin K: మీరు ధమనులలో కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించాలనుకుంటే, ఆహారంలో విటమిన్-కె మొత్తాన్నిపెంచండి. విటమిన్-కె గుండె సంబంధిత వ్యాధి అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ చేరడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు, ధమనులకు అడ్డంకి లేదా దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. ‘ద జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. విటమిన్-కె, గుండె మధ్య సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. పరిశోధకులు 23 సంవత్సరాల పాటు 50 వేల మంది ఆరోగ్య డేటాను పరిశీలించారు. విటమిన్-కె గుండె జబ్బుల అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

ఏరకమైన విటమిన్-కె ప్రమాదాన్ని తగ్గిస్తుంది

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విటమిన్-కెలో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది- విటమిన్-కె 1, ఇది ఆకుపచ్చ కూరగాయలు, కూరగాయల నూనె లో ఎక్కువగా ఉంటుంది.  రెండవది- విటమిన్-కె 2, ఇది మాంసం, గుడ్లు, జున్నులో లభిస్తుంది.  ఒక వ్యక్తి అథెరోస్క్లెరోసిస్‌తో బాధపడుతుంటే, ఆహారంలో విటమిన్ కె 1 తీసుకుంటే, అతడిని ఆసుపత్రిలో చేర్చే ప్రమాదం 21 శాతం తగ్గుతుంది. అథెరోస్క్లెరోసిస్ రోగులు వారి ఆహారంలో విటమిన్-కె 2 తగినంత మొత్తంలో తీసుకుంటే, అటువంటి రోగులు ఆసుపత్రిలో చేరే అవకాశాలు 14 శాతం తగ్గుతాయి.

గుండె జబ్బులు మరణానికి ప్రధాన కారణం

రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి చాలా మంది తమ ఆహారంలో విటమిన్-కె 1 ని చేర్చారు. కానీ అది ఎథెరోస్క్లెరోసిస్ వంటి అనేక ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుందని పరిశోధనలో పాల్గొన్న న్యూ ఎడిత్ కోవన్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ నికోలా బోండోనో చెప్పారు. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. పరిశోధకుడు డాక్టర్ బోండోనో  విటమిన్-కె ధమనులలో కాల్షియం చేరడాన్ని కూడా నిరోధిస్తుందని చెప్పారు.

భవిష్యత్తులో, ధమనులలో కాల్షియం నిక్షేపాలు దీని ద్వారా నియంత్రించబడతాయని పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ జామీ బెల్లింగ్ చెప్పారు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆస్ట్రేలియాలో వ్యాధి మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో, విటమిన్-కె గుండె జబ్బుల నుండి రక్షించడానికి పని చేస్తుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, గత 20 సంవత్సరాలలో గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమయ్యాయి. డయాబెటిస్‌తో పాటు, ఇప్పుడు ప్రపంచంలోని 10 వ్యాధులలో చిత్తవైకల్యం కూడా చేర్చబడింది, ఇది చాలా మంది ప్రజల ప్రాణాలను తీస్తోంది.

Also Read: Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..

Workouts after long break: విరామం తరువాత మళ్ళీ వర్కవుట్‌లు మొదలు పెడుతున్నారా? అయితే.. ఈ నియమాలు పాటించడం తప్పనిసరి!