Turmeric Water Benefits: పసుపు గురించి తెలియని వారుండరు. ప్రతీ భారతీయుల వంటింట్లో తప్పక ఉండే పదార్థాల్లో పసుపు ఒకటి. అయితే, పసుపులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అందుకే ఆరోగ్యవంతంగా ఉండేందుకు పసుపును నీటిలో కలిపి తీసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పసుపును గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదంలో పేర్కొనడం జరిగింది. మరి పసుపు వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పసుపు నీటిని కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది..
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో పసుపు నీటిని కూడా చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ నిరోధకంగా..
పసుపులో ఉండే కర్కుమిన్.. ఆరోగ్య రక్షణిగా పని చేస్తుంది. కర్కుమిన్‌లో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి. ఇవి కణితుల పెరుగుదలను నియంత్రిస్తాయి. క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై వృద్ధాప్యం ఛాయలను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమం..
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఆక్సీకరణ నష్టం నుండి మిమ్మల్ని రక్షించడానికి పని చేస్తాయి.