Turmeric Side Effects: ఆరోగ్యానికి మంచిదికదాని పసుపును విచ్చలవిడిగా వంటల్లో వాడేస్తున్నారా? ఇది తెలుసుకోండి

|

Sep 15, 2024 | 12:46 PM

నాన్‌వెజ్, వెజిటబుల్ కర్రీ.. ఏదైనా సరే ప్రతి వంటలో పసుపు ఉండాల్సిందే. పసుపులో చాలా ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపును సూపర్‌ఫుడ్‌గా పిలవచ్చు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి, శారీరక మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఉంచడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని పసుపును..

Turmeric Side Effects: ఆరోగ్యానికి మంచిదికదాని పసుపును విచ్చలవిడిగా వంటల్లో వాడేస్తున్నారా? ఇది తెలుసుకోండి
Turmeric Side Effects
Follow us on

నాన్‌వెజ్, వెజిటబుల్ కర్రీ.. ఏదైనా సరే ప్రతి వంటలో పసుపు ఉండాల్సిందే. పసుపులో చాలా ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపును సూపర్‌ఫుడ్‌గా పిలవచ్చు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి, శారీరక మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో పసుపును ఉంచడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని పసుపును అధికంగా తీసుకోవడం ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట వాస్తమే. కానీ పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, ఐరన్‌ శోషణకు ఆటంకం ఏర్పడతాయి. దీంతో గాయాల నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం రెట్టింపు అవుతుంది.పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 1.4 mg కర్కుమిన్ తీసుకుంటే సరిపోతుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది

పసుపులో ఆక్సలేట్లు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరినరీ ఆక్సలేట్ స్థాయి పెరుగుతుంది. పసుపులో 2 నుంచి 3 శాతం ఆక్సలేట్లు ఉంటాయి. ఇక్కడ 91 శాతం కరిగే ఆక్సలేట్లు కనిపిస్తాయి. ఇవి శరీరం ద్వారా గ్రహించబడతాయి. శరీరంలోని అదనపు ఆక్సలేట్ కాల్షియంలో నిల్వ ఉండి, మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. అంతే కాకుండా పసుపులో ఉండే మినరల్స్ కూడా మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయి.

అజీర్ణం

అధిక మొత్తంలో బయోయాక్టివ్ సమ్మేళనాలు గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పసుపు ఎక్కువగా తింటే జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటివి వస్తాయి. పసుపు ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు కూడా వస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, రోజుకు 1,000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పసుపు తీసుకోవడం వల్ల అజీర్ణం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఐరన్‌ శోషణ

పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ఐరన్‌ శోషణను తగ్గిస్తుంది. అధిక మొత్తంలో కర్కుమిన్ గట్‌లో ఐరన్‌ను బంధిస్తుంది. ఇది శరీరంలో రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది. నిజానికి, శరీరం కూరగాయల నుంచి ఐరన్ పొందుతుంది. కానీ పసుపు అధికంగా తినడం వల్ల ఐరన్‌ శోషణ తగ్గిస్తుంది. కాబట్టి ఆహారం వండేటప్పుడు పసుపును చూసి వేయండి.

చర్మ అలెర్జీల ప్రమాదం

పెద్ద మొత్తంలో పసుపును తీసుకునే వ్యక్తులు అలెర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ ప్రమాదంలో చిక్కుకుంటారు. దీని కారణంగా చెమట, దురద, ఎరుపు దద్దుర్లు పెరుగుతుంది. చర్మంపై మొటిమల సమస్య కూడా పెరుగుతుంది.

రక్తం పల్చబడవచ్చు

పసుపులో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాల వల్ల రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తం పలచబడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. కానీ గాయం లేదా ప్రమాదం జరిగినప్పుడు రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.