Throat Pain: చలికాలంలో గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇలా ఉపశమనం పొందండి

|

Nov 22, 2022 | 4:36 PM

చలికాలంలో గొంతు నొప్పిని అశ్రద్ధ చేయంటున్నారు నిపుణులు. అదే సమయంలో నొప్పి నివారణ కోసం ఎక్కువగా మాత్రలు వాడొద్దంటున్నారు. ఇవి బ్యాక్టీరియాతో ఏ మాత్రం పోరాడవని అందుకే ఇంటి చిట్కాలు ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Throat Pain: చలికాలంలో గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇలా ఉపశమనం పొందండి
Throat Pain
Follow us on

చలికాలంలో అందం, ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా వాతావరణంలోని మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు వెంటాడుతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. వీటితో పాటు చలికాలంలో గొంతునొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన పరిణామాలు సంభవిస్తాయి. అందుకే చలికాలంలో గొంతు నొప్పిని అశ్రద్ధ చేయంటున్నారు నిపుణులు. అదే సమయంలో నొప్పి నివారణ కోసం ఎక్కువగా మాత్రలు వాడొద్దంటున్నారు. ఇవి బ్యాక్టీరియాతో ఏ మాత్రం పోరాడవని అందుకే ఇంటి చిట్కాలు ఉపయోగించాలని సూచిస్తున్నారు. మరి చలికాలంలో గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి. వింటర్‌లో జలుబు, దగ్గు సాధారణం. ఒక్కోసారి వీటి వల్ల కూడా గొంతునొప్పి తలెత్తుతుంది. ఎందుకంటే జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఎగువ శ్వాసకోశంలో లక్షణాలను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జలుబు వస్తే గొంతులో గుచ్చుకోవడం సర్వసాధారణం.. ఒక్కోసారి జలుబు రాకముందే గొంతు నొప్పి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే వివిధ అలెర్జీలతో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా గొంతునొప్పి సమస్యలు ఉంటాయి. ఇక పొగతాగడం, ఎక్కువగా మద్యం సేవించడం వల్ల గొంతు నొప్పి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒక్కోసారి ఇవి గొంతు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదముంది.

నల్ల మిరియాలు, తేనె

గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి తేనె, నల్ల మిరియాలు ఉపయోగించవచ్చు. తేనెలో యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువ. ఇది గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇక తేనెలాగే ఎండుమిర్చి కూడా గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఒక చెంచా తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అంతే కాదు దీన్ని తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. మీ రోగనిరోధక శక్తి కూడా వేగంగా పెరుగుతుంది. దీన్ని నిత్యం తాగితే జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు మన దరి చేరవు.

పసుపు పాలు

దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నివారణకు పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. గొంతు నొప్పికి ఇది మంచి హోం రెమెడీ. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చిటికెల పసుపును తీసుకోవాలి. చలికాలంలో ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకవు.

ఇవి కూడా చదవండి

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..