
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి జీవన విధానంలో మార్పుల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో విటమిన్ B ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు తినడం వల్ల మన శరీరానికి సహాయం అందుతుంది.
పప్పుల్లో విటమిన్ B9 (ఫోలేట్) చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన పప్పు తింటే మన శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. రోజూ వీటిని తింటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గే అవకాశం ఉంది.
కివీ పండులో విటమిన్ B12, C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి. మనం తిన్నది బాగా జీర్ణం కావడానికి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడతాయి.
పుట్టగొడుగుల్లో B2, B3, B5 తో పాటు బయోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి కొవ్వును కరిగించి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. వీటిని తరచుగా తినడం వల్ల మన శరీరం శుభ్రంగా ఉంటుంది.
యాపిల్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే B13 అనే విటమిన్ కూడా సహజంగా లభిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి క్రమంగా తగ్గుతుంది.
రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తింటే మన శరీరానికి B2, B12 విటమిన్లు అందుతాయి. పెరుగులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
మనం వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ తింటే అందులో ఫైబర్‌తో పాటు B1, B3, B5, B6 అనే పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడానికి సహాయపడతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
న్యూట్రిషనల్ ఈస్ట్ అనే పొడిలో విటమిన్ B12 బాగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని సూప్ లలో, శాకాహార వంటకాల్లో వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పాలకూరలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే B1, B2 లాంటి విటమిన్లు కూడా సహజంగా లభిస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. వారంలో కనీసం మూడు సార్లు పాలకూర తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
వేరుశనగల్లో చాలా రకాల విటమిన్ B లు ఉంటాయి. వాటిలో ఉండే మంచి కొవ్వులు మన గుండెకు చాలా మేలు చేస్తాయి. నూనె లేకుండా వేయించిన వేరుశనగలు తింటే మనకు శక్తి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ ఆహారాలను మన రోజువారీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)