చాలా మంది సాంబారు, పులుసు, సలాడ్, ఇతర అనేక కూరగాయాలలో టొమాటోను ఉపయోగిస్తారు. టొమాటోను వినియోగించకూంటే కొందరు ఆ వంటకాలను పెద్దగా ఇష్టపడరు. టొమాటో వేస్తే ఆ వంటలకు రుచి వస్తుందనేది ఆహార ప్రియుల అభిప్రాయం. అయితే, టొమాటో తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యకరం కూడా. ఇందులో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. టొమాటో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, దీన్ని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. టొమాటో తినడం వలన కలిగే నష్టాలేంటి? ఎవరు టొమాటోలను ఎక్కువగా తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు టొమాటోనుు తీసుకోకూడదు. దీని వల్ల సమస్య మరింత పెరుగుతుంది. టొమాటోలో ఉండే గింజల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి.
టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య వస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, ఇది గ్యాస్, గుండెల్లో మంట సమస్యను పెంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
టొమాటోల్లో టెర్పెనెస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ టమోటాలు తినడం వల్ల శరీర దుర్వాసన పెరుగుతుంది.
టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఎందుకంటే టొమాటోలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది కీళ్లలో వాపును కలిగిస్తుంది.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..