Apple Cider Vinegar: ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వాడితే.. ఈ 4 సమస్యలకు చెక్ పెట్టినట్లే.. మరి ఎలా వాడాలంటే..?

|

Jan 29, 2023 | 12:39 PM

సాధారణంగా చర్మం, జుట్టు సమస్యలను వదిలించుకోవడానికి ,వంటలలో ఉపయోగించే ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి, దాని ప్రయోజనాల గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. అమ్ల గుణాలు కలిగిన ఈ వెనిగర్..

Apple Cider Vinegar: ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వాడితే.. ఈ 4 సమస్యలకు చెక్ పెట్టినట్లే.. మరి ఎలా వాడాలంటే..?
Apple Cider Vinegar
Follow us on

సాధారణంగా చర్మం, జుట్టు సమస్యలను వదిలించుకోవడానికి ,వంటలలో ఉపయోగించే ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి, దాని ప్రయోజనాల గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. అమ్ల గుణాలు కలిగిన ఈ వెనిగర్ మన వంటల రుచిని పెంచడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఈ యాపిల్‌ సైడ్ వెనిగర్ ను నిర్ణీత మోతాదులో రోజు వారిగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆపిల్ సైడర్ వెనిగర్‌‌తో మన ఆరోగ్యానికి ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చక్కెర స్థాయి కంట్రోల్: యాపిల్ సైడర్ వెనిగర్‌పై జరిపిన అనేక అధ్యయనాలు ప్రకారం ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కానీ దీనిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని 19 నుంచి 34 శాతం పెంచడానికి పనిచేస్తుంది.
  2. బరువు తగ్గడానికి: ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువ కాలం నిండుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో కేలరీల పరిమాణం చాలా తక్కువ. ఒక చెంచా వెనిగర్‌లో 3 కేలరీలు ఉంటాయి అంటే దీనిని తినడం వల్ల కొవ్వు పెరగదు.
  3. గొంతు నొప్పి: యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల దీనిని మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది నోటి దుర్వాసనను తొలగించడమే కాక కావిటీస్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఇది అమ్ల గుణాలను కలిగి ఉన్నందున  నీటితో కలిపి వాడాలి.
  4. గుండెకు మంచిది: అనేక కారణాల వల్ల గుండె జబ్బులు సంభవించవచ్చు అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది జంతువులలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ క్రమంలోనే ఇది మానవ హృదయానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం.

గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఈ సమాచారానికి ఎటువంటి ధ్రువీకరణ లేదు. కాబట్టి ఆరోగ్య పరమైన సూచనలను పాటించే ముందు వైద్య నిపుణులను తప్పనిసరిగా సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..