Clove Tea: సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలనుకుంటే లవంగం టీ తాగాల్సిందే.. మరి దీనిని ఎలా చేసుకోవాలంటే..

|

Feb 02, 2023 | 7:45 AM

వంటింటిలో కనిపించే ప్రతిదీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనదిగానే ఉంటుంది. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలుగా చెప్పుకునే మన మసాలా దినుసులతో ఆరోగ్యానికి చెప్పలేనన్ని..

Clove Tea:  సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలనుకుంటే లవంగం టీ తాగాల్సిందే.. మరి దీనిని ఎలా చేసుకోవాలంటే..
Clove Tea Benefits
Follow us on

వంటింటిలో కనిపించే ప్రతిదీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనదిగానే ఉంటుంది. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలుగా చెప్పుకునే మన మసాలా దినుసులతో ఆరోగ్యానికి చెప్పలేనన్ని లాభాలు. అటువంటి మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. ఇంకా దీనికి ఆయుర్వేదంలో కూడా ప్రముఖ స్థానం ఉంది. లవంగం ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే రుచికరమైన మసాలా దినుసు. అన్ని కూరలు, బిర్యానీలు తయారు చేయడానికి.. వాటి రుచిని పెంచడానికి లవంగాలను విరివిగా ఉపయోగిస్తారు. లవంగాలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు చలికాలంలో లవంగం టీని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకుంటే జలుబు, దగ్గుతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. లవంగం టీ చేయడానికి మీరు పాలను ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. లవంగం టీ ప్రయోజనాలు, దానిని ఎలా తయారు చేయడం వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగం టీ ఎలా తయారీ విధానం.. 

లవంగం టీ చేయడానికి ఒకటిన్నర కప్పు నీటిలో రెండు లవంగాలను బాగా దంచి వేయాలి. గ్యాస్‌పై కొద్దిసేపు మరిగించాలి. తర్వాత టీని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఆ తర్వాత తాగాలి. ఈ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. కానీ లవంగం దాని వేడి ప్రభావం వల్ల కూడా హాని కలిగిస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా తాగవద్దు.

ఇవి కూడా చదవండి
  1. లవంగాలు రుచి ఘాటుగా ఉన్నప్పటికీ శీతాకాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇంకా లవంగం టీని తాగడం వల్ల గొంతు నొప్పి, మంట, దగ్గు, జలుబు వంటి పలు రకాల సీజనల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  2. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . బరువు తగ్గాలనుకుంటే లవంగం టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  3. లవంగం శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది . తద్వారా శరీరానికి కావలసిన శక్తి త్వతరితంగా అందుతుంది.
  4. దంతాలలో నొప్పి, చిగుళ్ళలో వాపు ఉంటే లవంగం టీ తాగడం మంచిది. దీని ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగం టీ నోటిలోని బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది.
  5. లవంగం టీ మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అన్ని చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.
  6. ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు లవంగం కీలకపాత్ర పోషిస్తుంది. లవంగం తినడం వల్ల శరీరంలోని విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఫలితంగా బ్లడ్ ప్యూరిఫై జరిగి శరీరంలో వైట్ బ్లడ్‌సెల్స్ నిర్మాణం సాధ్యమవుతుంది. అంతేకాకుండా..లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం