Tips for Cold Relief: చలికాలంలో చాలామందిని జలుబు సమస్య వేధిస్తుంటుంది. ముక్కు కారటం, తలనొప్పి, బాడీ పెయిన్స్, గొంతునొప్పి వంటి సమస్యలు మనుషులను చికాకు పెట్టిస్తాయి. రోజు వారి పనులు చేసుకునేందుకు ఆటంకం కలిగిస్తాయి. తీవ్రమైన చలిగాలుల కారణంగా మరిన్ని ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి చలికాలంలో జలుబు రాకుండా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి..
అసలే కరోనా కాలం. చేతులను నిరంతరం కడుక్కుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు.
2. హైడ్రేటెడ్‌గా ఉండాలి..
శీతాకాలంలో సాధారణంగా దాహం వేయదు. కానీ, రోజువారిగా సరిపడా నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందని, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. సరిపడా నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు వెళ్లిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
3. ఆరోగ్యకరమైన ఫుడ్‌నే తినాలి..
ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవాలి. తద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు సహకరిస్తుంది. జింక్, విటమిన్ డి ఉన్న పదర్థాలు ఎక్కువగా తీసుకోవడంపై దృష్టి పెట్టండి.
4. తగినంత నిద్ర..
జలుబు త్వరగా తగ్గాలన్నా.. ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలన్నా సరిపడా నిద్ర ఉండాలి. నిద్ర లేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. సరిపడా నిద్ర ఉంటే.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
5. వ్యాయామం..
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. బరువు తగ్గడంతో పాటు.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీంతోపాటు.. యోగా కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
Also read:
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…