Guava Side Effects: చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో జామ పండు ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా లభించే జామపండుతో తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే జామపండుతో లాభాలు కలుగుతాయనే దాంట్లో ఎంత వరకు నిజం ఉందో.. అతిగా తీసుకుంటే అనర్థాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు జామ పండ్లను తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకీ జామపండ్లకు ఎవరు దూరంగా ఉండాలంటే..
* నిత్యం కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారు జామపండ్లకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ఫ్రక్టోజ్, విటమిస్ సి కారణంగా తినగానే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం మరింత ఎక్కువవుతుంది.
* జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కూడా జామపండ్లకు దూరంగా ఉండడమే మంచిది. దీనివల్ల జలుబు ప్రభావం మరింత ఎక్కువుతుంది. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు జామ తింటే జలుగు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
* షుగర్ పేషెంట్స్ కూడా జామకు దూరంగా ఉంటే మంచిది. జామలో సహజంంగా ఉండే చక్కెర వల్ల దుష్ప్రభావం పడుతుంది. అయితే పరిమిత సంఖ్యలో తీసుకుంటే ఏమాత్రం కాదని చెబుతుంటారు.
* జామపండులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అయితే పరిమితికి మించి జామ పండ్లను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..