మనం ప్రతిదానికి మెడిసిన్(Medicine) వాడతాం. కానీ మన వంటిట్లో ఉన్న వాటిని సరిగా ఉపయోగిస్తే ఏం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఒకప్పుడు బంగారం(Gold) కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్కను(cinnamon) అప్పట్లో కరెన్సీగా కూడా వాడేవారు. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన ఈ స్పైస్‌గా చరిత్రకెక్కింది. భారత్‌లో వంటకాలతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తారు. కాఫీ, టీల్లోనూ వాడే దాల్చిన చెక్క ఘాటైన వాసనతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
లవంగాలు వంటి ఇతర మసాలా దినుసులతో పాటు దాల్చిన చెక్కతో మెరుగైన జ్ఞాపక శక్తి , ఒత్తిడి మటుమాయంకావడంతో పాటు నిద్రలేమి సమస్యను నివారించడం ఇతర ప్రయోజనాలు చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం వాడటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఔషధంగా అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
దాల్చిన చెక్కతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దాల్చిన చెక్క జీర్ణ వ్యవస్థలో వాపు ప్రక్రియను నిరోధిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. రక్తపోటును కూడా దాల్చిన చెక్క తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దాల్చిన చెక్కతో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు