AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ లెవెల్స్ తగ్గించడంలో బెస్ట్ ఫుడ్ ఇది.. మీరు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాల్సిందే..!

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం డయాబెటిస్‌ ను నివారించడానికీ, అదుపులో ఉంచడానికీ చాలా అవసరం. సాధారణంగా ఇది ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా నిర్వహించవచ్చు. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. బ్రోకోలీ అనే కూరగాయ ఈ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

షుగర్ లెవెల్స్ తగ్గించడంలో బెస్ట్ ఫుడ్ ఇది.. మీరు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాల్సిందే..!
Diabetes
Prashanthi V
|

Updated on: Jul 06, 2025 | 9:07 PM

Share

స్వీడన్ లోని గోతెన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం బ్రోకోలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సహజ పదార్థం.. ముందస్తు డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని గుర్తించింది. 35 నుండి 75 సంవత్సరాల వయస్సున్న.. అధిక బరువు లావు ఉన్న 89 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కు సల్ఫోరాఫేన్ ఆహారంలో ఇవ్వగా, మరొకరికి ప్లేసెబో ఇచ్చారు. 12 వారాల తర్వాత 74 మంది పరిశోధన పూర్తి చేశారు.

ఈ అధ్యయనంలో సల్ఫోరాఫేన్ తీసుకున్న వారిలో ఉపవాసం ఉన్నప్పుడు గ్లూకోజ్ స్థాయి బాగా తగ్గిందని తెలిసింది. ముఖ్యంగా వయసు తక్కువ ఉన్నవారు.. కొవ్వు కాలేయ సమస్యలు లేనివారు. తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. సల్ఫోరాఫేన్ అందరికీ ఒకేలా పనిచేయదు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారిలో ఇది మరింత బాగా పనిచేస్తుందని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తుంది.

2017లో జరిగిన మరో పరిశోధనలో కూడా బ్రోకోలీ మొలకల నుంచి తీసిన సల్ఫోరాఫేన్ పెద్ద మొత్తంలో తీసుకున్న డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించిందని తేలింది. తాజా అధ్యయనం ముందస్తు డయాబెటిస్ ఉన్నవారిపై దాని ప్రభావాన్ని చూపింది. ముందస్తు డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ కు ముందు వచ్చే దశ. ఇది శరీరంలోని ఇన్సులిన్ నిర్మాణంలో తలెత్తే లోపాల వల్ల నెమ్మదిగా రక్త చక్కెర స్థాయి పెరగడం వల్ల కలుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ముందస్తు డయాబెటిస్ ఉంది. అయితే దీనికి ఒక స్పష్టమైన చికిత్సా పద్ధతి లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ సమస్యను గుర్తించలేరు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ముందే గుర్తించి వ్యక్తిగత లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సల్ఫోరాఫేన్ ఆధారంగా తయారయ్యే ప్రత్యేక ఆహారాలు భవిష్యత్తులో ఈ చికిత్సలకు మార్గం చూపవచ్చు.

బ్రోకోలీ ద్వారా సల్ఫోరాఫేన్ పొందడం ఒక్కటే కాదు.. వ్యాయామం, బరువు నియంత్రణ, సమతుల్య ఆహారం వంటి జీవనశైలి మార్పులు ఎప్పటికీ చాలా ముఖ్యమైనవి. ఈ అధ్యయనం ఫలితాలు చక్కెర నియంత్రణలో కొత్త మార్గాలు చూపించాయి. అంతేకాదు మన శరీరంలో జీవక్రియలు, మలబద్ధకం, ఆహార నాళంలోని గట్ ఫ్లోరా మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతాయో కూడా స్పష్టంగా తెలియజేశాయి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?