
కొలెస్ట్రాల్…ఇది రక్తంలో ఉండే మైనపు పదార్థం. ఇది కణత్వచాల పనితీరు, హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. 1 మంచి కొలెస్ట్రాల్. 2 చెడు కొలెస్ట్రాల్. శరీరానికి చెడు కొలెస్ట్రాల్ పెరగడం చాలా ఇబ్బందులకు కారణం అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఛాతీనొప్పి, ఊబకాయం, కాళ్లనొప్పి, చర్మంపై పసుపు రంగులో మచ్చలు, వేగవంతమైన గుండె చప్పుడు, గుండె జబ్బులు, స్ట్రోక్, పెరిఫెరల్ వాస్కులర్ డిసిజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీనంతటికి కారణంగా మన జీవనశైలి. ఆహారంలో కొన్ని రకాల ఆహారాలు అంటే జంక్ ఫుడ్, నూనెలు, మసాలాలు, శుద్ధి చేసిన పిండితో చేసిన ఆహారాలు కొలెస్ట్రాల్ ను ప్రభావితం చేస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలంట మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. కాలనుగుణంగా వచ్చే ఆహారాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్నితగ్గిస్తాయి. అధ్యయనాల ప్రకారం, కరిగే ఫైబర్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కల ఆధారిత ఆహారాలు లేదా కూరగాయలలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ శోషణను నెమ్మదిస్తుంది. అంతేకాదు కాలేయం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
న్యూట్రిషనిస్టు ప్రీతి త్యాగి మాట్లాడుతూ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే 8 కాలానుగుణ కూరగాయాలను సూచించారు. అవేంటో ఓసారి చూద్దాం.
1. బచ్చలికూర:
మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. బచ్చలికూర కాలానుగుణ కూరగాయ.ఇందులో విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చురుకైన జీవనశైలిని అనుసరించాలనుకుంటే బచ్చలికూర నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాలన్‌ను తగ్గిస్తుందని అనేక అధ్యయనాల్లో నిరూపించబడింది.
2. బ్రోకలీ:
బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కాల్షియం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచుపదార్థం శరీరాన్ని అంటుపెట్టుకుని ఉన్నచెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
3. క్యారెట్లు:
ఇందులో పీచుపదార్థం, బీటాకొరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో LDL యొక్క ఆక్సీకరణను నివారించడంలో సహాయపడుతుంది. ఇది గొప్ప గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే రక్త శుద్ధిలో సహాయపడుతుంది.
4. బీట్ రూట్స్ :
దుంపలు, మూల కూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కరిగే, కరగని రెండూ రకాల ఫైబర్ ఇందులో ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరించడంతోపాటు శరీరంలోని రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడే నైట్రేట్ల యొక్క గొప్ప మూలం. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. ఆస్పరాగస్:
ఆస్పరాగస్, పైన పేర్కొన్న కూరగాయల మాదిరిగానే అవసరమైన విటమిన్లు, ఖనిజాల యొక్క గొప్ప మూలం. ముఖ్యంగా ఇందులో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
6. క్యాబేజీ:
క్యాబేజీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది గుండె జబ్బుల నుండి నివారణకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో మాత్రమే కాకుండా శరీరంలోని రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది.
7. బ్రస్సెల్స్ మొలకలు:
క్రూసిఫరస్ కూరగాయల కుటుంబం నుండి వచ్చిన బ్రస్సెల్ మొలకలు మన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.
8. కాకరకాయ;
కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో మెరుగ్గా పనిచేస్తుంది. గుండె పనితీరును ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ప్రతిరోజూ కాకరకాయ రసం తీసుకున్నట్లయితే అద్బుతంగా పనిచేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..