Health Tips: నీటిలో ఇవి కలుపుకుని తాగితే.. ఇక ఆ సమస్యే దరిచేరదు.. మీరూ ట్రై చేయండి..

|

Apr 26, 2023 | 12:25 PM

మన శరీరంలో దాదాపు 60 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది.. అందుకే నీరు మన శరీరానికి చాలా ముఖ్యం.. నీటిలో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదేసమయంలో, అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి కూడా నీరు పనిచేస్తుంది.

Health Tips: నీటిలో ఇవి కలుపుకుని తాగితే.. ఇక ఆ సమస్యే దరిచేరదు.. మీరూ ట్రై చేయండి..
Water
Follow us on

మన శరీరంలో దాదాపు 60 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది.. అందుకే నీరు మన శరీరానికి చాలా ముఖ్యం.. నీటిలో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదేసమయంలో, అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి కూడా నీరు పనిచేస్తుంది. అయితే, ప్రస్తుతం ఎండలు వేడెక్కుతున్నాయి. ఈ వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు పుష్కలంగా నీరు తాగాలి. లేకపోతే.. మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు సైతం మొదలవుతాయి. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య రాకూడదంటే కొన్ని పదార్థాలను నీటిలో కలుపుకుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏయే పదార్థాలను నీటిలో కలుపుకుని తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పదార్థాలను నీటిలో కలిపి తాగాలి..

కీర దోసకాయ – పుదీనా: కీరదోసకాయ, పుదీనాను నీళ్లలో కలుపుకుని తాగవచ్చు. ఇందుకోసం ఓ బాటిల్ లో నీళ్లు నింపి అందులో కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు వేసి వదిలేయండి. ఇలా రోజూ ఈ నీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇంకా నీటి కొరత తొలగిపోతుంది.

నిమ్మకాయ: వేసవిలో నిమ్మకాయను ఉపయోగించడం చాలా మేలు చేస్తుంది. ఉప్పుకు బదులు నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి తాగితే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. దీని కోసం, మీరు నిమ్మరసాన్ని నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సోంపు గింజలు: మీరు ఒక చెంచా సోపు గింజలను ఒక జగ్‌ నీటిలో వేసి బాగా మరిగించి చల్లారనివ్వాలి. ఇది హీట్ స్ట్రోక్, కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

చియా సీడ్స్: మీరు చియా గింజలను నీటిలో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య దూరమై.. శీరరం హైడ్రేట్ గా అవుతుంది. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని కూడా తొలగిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ సమస్య ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..