White Teeth: ముఖారవిందంలో దంతాలు చాలా ముఖ్యమైనవి. దంతాలు ఆకర్షణీయంగా, తెల్లగా ఉన్నట్లయితే మనిషి ఇతరులను ఇట్టే ఆకర్షించగలుగుతారు. అయితే, తెల్లగా మెరిసే దంతాలు అందరికీ ఉండవు. మనం తాగే ఫ్లోరిన్ నీళ్లు, ఆహారాలు, ఇతర కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. అయితే, ఈ పసుపు రంగును పోగొట్టేందుకు వంటింటి చిట్కాలు ఉన్నాయి. మనం నిత్యం వాడే కొన్ని వస్తువులతోనే దంతాలను తెల్లగా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనే..
పసుపు రంగులోకి మారిన దంతాలను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనేను ఉపయోగించవచ్చు. ముందుగా మీరు ఒక స్ఫూన్ కొబ్బరి నూనెను మీ నోటి లోపల ఐదు నిమిషాలు ఉంచాలి. ఇది కాకుండా, మీరు మీ టూత్ బ్రష్‌లో కొన్ని చుక్కల నూనెను కూడా వేసుకోవచ్చు. అలా బ్రష్‌పై నూనే వేసుకుని ఐదు నిమిషాలు పళ్ళు తోముకోవాలి. ఆ తరువాత నోరు కడుక్కోవాలి. అలా నిత్యం చేయడం ద్వారా కొన్ని రోజుల తరువాత దంతాలు ముత్యాల్లా మెరిసిపోతాయి.
ఆపిల్ వెనిగర్..
ఆపిల్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి చెడు బ్యాక్టీరియాను చంపి దంతాలకు పట్టిన పసుపు రంగు పొరలను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో పాటు, ఆపిల్ వెనిగర్ పిహెచ్ మీ దంతాల మరకలను కూడా తొలగిస్తుంది. అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్ ను మీ దంతాలపై రెండు నిమిషాలు రుద్దాల్సి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం వస్తుంది.
నిమ్మ తొక్క..
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో, నిమ్మ తొక్క కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. నిమ్మ తొక్క మీ దంతాలను శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కను మీ దంతాలపై రుద్దాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. కొద్ది రోజుల తరువాత ఫలితాన్ని మీరే చూస్తారు.
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం, తినడం వల్ల దంతాలు సహజంగానే తెల్లబడతాయి. కారణమేంటంటే.. ఇందులో చాలా ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది దంతాల పసుపును తొలగించడానికి సహాయపడుతుంది.
వంట సోడా..
బేకింగ్ సోడా శుభ్రపరిచే లక్షణాల గురించి అందరికీ తెలుసు. ఇది మీ దంతాలకు అద్భుతంగా పని చేస్తుంది. దీని కోసం, మీరు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను జోడించాలి. ఈ పేస్ట్‌లో కొన్నింటిని మీ టూత్ బ్రష్‌పై అప్లై చేసి, ఒకటి లేదా రెండు నిమిషాలు పళ్ళు తోముకోవాలి. ఆ తర్వాత నోరు కడుక్కోవాలి.
Also read:
Oxygen: ఆపరేషన్ సముద్ర సేతు -2.. సింగపూర్ నుంచి ఆక్సిజన్ సిలెండర్లతో విశాఖ చేరుకున్న ఐరావత్ నౌక