Eye Problems: కంటి చూపు సమస్యల రాకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మార్చుకోవాల్సిందే!

|

Jan 25, 2023 | 11:51 AM

మన శరీరంలో కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదైనా కంటి సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేకుండా వెంటనే వైద్యులన్ని సంప్రదించాలి. ఎందుకంటే మన ప్రపంచాన్ని చూసేది కంటితోనే అందుకే..

Eye Problems: కంటి చూపు సమస్యల రాకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మార్చుకోవాల్సిందే!
Eye
Follow us on

మన శరీరంలో కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదైనా కంటి సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేకుండా వెంటనే వైద్యులన్ని సంప్రదించాలి. ఎందుకంటే మన ప్రపంచాన్ని చూసేది కంటితోనే అందుకే కంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. రోజూవారీ అలవాట్లతో కంటి చూపు మందగిస్తుంది. అందుకే కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కళ్లు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే చాలామంది కళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కంటి చూపు మందగించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతాయని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. కంటి సమస్య రాగానే కళ్లు జోడు, ఇతర చికిత్సలను ఉపయోగిస్తుంటాము. అయితే కంటి సమస్యలు తలెత్తకముందే కొన్ని అలవాట్లను మార్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆహారాలను ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు కంటికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అయితే మీ కంటి చూపు ను మంచిగా ఉంచడానికి ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్ వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటికి ప్రయోజనాలు కలుగుతాయి.

కంటి చూపుకోసం మార్చుకోవాల్సిన అలవాట్లు:

కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై చిన్నగా ఉండే అక్షరాలను చదవద్దు. స్క్రీన్‌లకు ఎక్కువగా అతుక్కుపోతే అది కళ్ళకు హాని కలిగిస్తుంది. కళ్లు దెబ్బతింటాయి. కళ్లు పొడిబారినట్లు అవుతాయి. దీని వల్ల తలనొప్పి, కంటి ఒత్తిడికి లోనవుతాయి. అలాగే సరైన నిద్రలేని కారణంగా కంటి సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ఒకటి కంటి చూపు మందగించడం. రోజుకు కనీసం 7 గంటల పాటు నిద్ర చాలా తప్పనిసరి అవసరం. దీని వల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఎక్కువ కంప్యూటర్ల ముందు వర్క్‌ చేయడం, మొబైల్‌ను ఎక్కువగా చూసేవారిలో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ ఫుడ్‌తో ప్రమాదం..

తినే ఆహారంలో విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను నివారించవచ్చు. చాలామంది ఫాస్ట్ ఫుడ్ రుచికరంగా ఉంటుందని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. క్యారెట్, నారింజ, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, సీ ఫుడ్స్, బచ్చలికూర మొదలైనవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ధూమపానంతో..

ఇక ధూమపానంతో గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు కంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. ధూమపానం సిగరెట్లు, ఇతర రకాల పొగాకు ఉత్పతులకు దూరంగా ఉండాలి.

ఎండలో తిరిగే సమయంలో..

ఇక ఎండలో తిరిగే సమయంలో కళ్ళు హానికరమైన యూవీ కిరణాలకు గురికావచ్చు. అది కంటి క్యాన్సర్ కు దారితీయవచ్చు. అందుకే ఎండలోకి వెళ్లే సమయంలో దుమ్ము పడకుండా , యూవీ కిరణాల నుండి రక్షణగా ఉండేందుకు సన్ గ్లాస్ అద్దాలను వాడుకోవటం మంచిది.

చీటికిమాటికి కళ్లు నలపడం, రుద్దడం చేయవద్దు:

కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయవద్దు. దీంతో మీ కళ్ల బయటి ఉపరితలం దెబ్బతింటుంది. కార్నియా బలహీనంగా మారుతుంది. దురదలు ఉన్న సందర్భంలో చల్లని నీటితో కళ్లను శుభ్రపరుచుకోవటం ఉత్తమం. మనం తక్కువ నీరు తాగితే ఈ కండరాల చురుకుదనం తగ్గుతుంది. దీని వల్ల కళ్లలో వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. కంట్లో నలక, దుమ్ము చేరినపుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. ఇలా కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి