Health Tips: ఈ 5 అలవాట్లు మీ ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువులు.. హెల్తీగా ఉండాలంటే.. వీటికి వెంటనే గుడ్‌ బై చెప్పేయండి..

|

Jul 27, 2021 | 3:26 PM

Health Tips: చాలా మంది తక్కువ ఆహారం తీసుకుంటుంటారు. కానీ, బరువు మాత్రం వేగంగా పెరుగుతారు. బరువు తగ్గేందుకు ఎంత ప్రయత్నించినా

Health Tips: ఈ 5 అలవాట్లు మీ ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువులు.. హెల్తీగా ఉండాలంటే.. వీటికి వెంటనే గుడ్‌ బై చెప్పేయండి..
Health
Follow us on

Health Tips: చాలా మంది తక్కువ ఆహారం తీసుకుంటుంటారు. కానీ, బరువు మాత్రం వేగంగా పెరుగుతారు. బరువు తగ్గేందుకు ఎంత ప్రయత్నించినా తగ్గరు. అయితే, బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆహారం మాత్రమే కాదు.. కొన్ని చెడు అలవాట్లు కూడా బరువును వేగంగా పెంచుతాయి. అధిక బరువుతో బాధపడేవారు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. బరువు పెరగడం వల్ల, చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. ఈ అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆనారోగ్యానికి కారణమయ్యే ప్రధానంగా ఐదు అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. తక్కువ ఆహారం తినడం, తినడం తగ్గించడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం సరికాదు. దానికి బదులుగా ఎక్కువ ఆకలి అయ్యేవరకు వేచి ఉండటం మంచిది. ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవడం ద్వారా శరీర బరువు చాలా త్వరగా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ విధానాన్ని అలవాటు చేసుకోండి. అతిగా తినడాన్ని నివారించి.. బాగా ఆకలితో ఉన్న సమయంలో శరీరానికి సరిపడా తినండి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినకుండా.. పండ్లు, సలాడ్లు, జ్యూస్‌లు రోజులో ఒకసారి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

2. గాఢ నిద్రను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. ప్రతీ రోజూ ఎక్కువసేపు పడుకున్నా.. అలాగని తక్కువ సమయం నిద్రపోయినా.. ఆరోగ్యానికి హానీకరం. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. అనేక వ్యాధుల బారిన పడేందుకు దోహదపడుతుంది.

3. చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బెడ్‌ టీ తాగడం అలవాటు. కానీ బెడ్ టీ అలవాటు మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే టీ తాగడం వల్ల గ్యాస్, అల్సర్ సమస్యలు పెరుగుతాయి. ఖాళీ కడుపుతో చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. టీ కి బదులుగా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించే అలవాటు చేసుకోండి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి నుంచి నాలుగు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి.

4. శరీర కేలరీలను బర్న్ చేయడానికి శారీరక శ్రమ చాలా అవసరం. కానీ ఈ విషయాలు తెలిసి కూడా చాలా మంది దానిని విస్మరిస్తారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోవడం, ఇంటర్నెట్ షాపింగ్ ద్వారా అన్ని పనులు కానిచ్చేస్తుంటారు. జనాలు కంఫర్ట్ జోన్‌లో నివసించడానికి అలవాటు పడ్డారు. తద్వారా శారరీక శ్రమకు దూరమయ్యారు. ఇదే ఇప్పుడు జనాల పాలిట శాపంగా మారింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భాశయ సమస్యలు, ఆర్థరైటిస్, వెన్నునొప్పి, సయాటికా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే.. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రతీ రోజూ ఉదయమే మేల్కోండి. కొంత సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

5. రాత్రి భోజనం తిన్న తరువాత ఆహారం జీర్ణం అవడానికి కొంతసేపు నడవడం చాలా అవసరం. ఈ విషయాన్ని పెద్దలు, పూర్వికులు అనేక సందర్భాల్లో చెబుతూనే ఉంటారు. కానీ, ఎవరూ దానిని లక్ష్యపెట్టరు. చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. లేదా అక్కడే కూర్చుని కబుర్చు చెబుతూ ఉంటారు. అది అత్యంత ప్రమాదకరం. ఊబకాయం సమస్య ఉత్పన్నమై.. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత కొంతసేపు నడిచేందుకు ప్రయత్నించండి.

Also read:

Tokyo Olympics 2021: టోక్యోలో విజృంభిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు.. క్రీడా గ్రామంలో..

ICAR AIEEA 2021: ఐకార్‌ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

MLA dumps: వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం చూసిన ఎమ్మెల్యే.. అధికారుల తీరుపై ఆగ్రహించి ఏంచేశాడంటే..?