బలహీనంగా ఉన్నవారికి ఈ 3 ఆయుర్వేద మందులు బెస్ట్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ అస్సలు ఉండవు..!

Ayurvedic Medicines: ఒక మనిషి బలహీనంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధాన కారణం పోషకాల కొరత

బలహీనంగా ఉన్నవారికి ఈ 3 ఆయుర్వేద మందులు బెస్ట్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ అస్సలు ఉండవు..!
Ayurvedic

Updated on: Mar 09, 2022 | 9:50 PM

Ayurvedic Medicines: ఒక మనిషి బలహీనంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి.
ప్రధాన కారణం పోషకాల కొరత అయితే మరొకటి శరీరంలో రక్తం లేకపోవడం. దీంతో పాటు
శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం కూడా ఒక వ్యక్తిని నిరంతరం అలసిపోయేలా
చేస్తుంది. బలహీనంగా మారుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరిగ్గా జరగకపోతే శరీరం బరువుగా
ఉండటం, శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు, అంతర్గత వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు
తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తాయి. ఉసిరి పొడిని
ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ రెండూ బలంగా
తయారవుతాయి. దీని కోసం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఉసిరి పొడిని
కరిగించి ఉదయాన్నే ఈ నీటిని తాగాలి.

లైకోరైస్ పొడి

దగ్గును తొలగించడానికి, కఫాన్ని నియంత్రించడానికి, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి
లైకోరైస్ పొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ఆహారం తిన్న తర్వాత రోజుకు
రెండుసార్లు తేనెతో కలిపి తీసుకోవచ్చు. నాలుగో వంతు యాలకుల పొడిని తేనెలో కలిపి ఆ
మిశ్రమాన్ని నెమ్మదిగా నాకడం చేయాలి.

ద్రాక్షారిష్ట

ఇది ఒక టానిక్. దీనిని ద్రాక్ష రసంతో తయారుచేస్తారు. అందుకే దీనిని ద్రాక్షారిష్ట అంటారు. ఇది
శ్వాసకోశ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు శారీరక బలహీనతను దూరం చేస్తుంది. ఇది
శరీరంలో రక్తాన్ని పెంచడానికి, చెడు రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. రక్తహీనత విషయంలో
ఈ ఔషధం వినియోగం ప్రత్యేక ప్రయోజనాన్ని ఇస్తుంది. దీన్ని తీసుకోవడానికి కచ్చితంగా
ఆయుర్వేద పండితుడి సలహా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరాలు ఒక్కో విధంగా
ఉంటాయి. అందుకే వారికి తగిన విధంగా ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది.

Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలు భర్తల విజయంలో పెద్ద పాత్ర పోషిస్తారు..!

Viral Video: గుడ్ల జోలికొస్తే ఖబర్దార్.. రప్ఫాడించిన నెమలి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Viral Video: ఉడుతను సేవ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన శునకం..