Health: నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నట్లే..

Health: శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో అన్ని రకాల జీవక్రియలకు విటమిన్‌ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలు, ఎముకలు...

Health: నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నట్లే..
Vitamin D

Updated on: Nov 19, 2021 | 1:41 PM

Health: శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో అన్ని రకాల జీవక్రియలకు విటమిన్‌ డి ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలు, ఎముకలు ధృడంగా ఉండాలన్నా విటమిన్‌ డి తగిన మోతాదులో ఉండాల్సిందే. సాధారణంగా విటమిన్‌ – డి సూర్యరక్ష్మితోనే సహజంగా లభిస్తుంది. కానీ ప్రస్తుతం మారుతోన్న జీవన విధానం, ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల తగినంత సూర్యరక్ష్మి అందడం లేదు. దీంతో చాలా మంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే చాలా మందికి అసలు తాము విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నామనే విషయం కూడా తెలియదు. సమస్య తీవ్రతరం అయిన తర్వాత కానీ తెలుసుకోరు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మొదట్లోనే విటమిన్‌ డి లోపాన్ని గుర్తిస్తే ఈ లోపాన్ని సులువుగా తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ డి లోపం ఉంటే శరీరంలో ముందుగానే కొన్ని మార్పులు జరుగుతాయి. అందులో ప్రధానమైంది నోటిలో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా విటమిన్ డి లోపాన్ని ముందస్తుగానే గుర్తించవచ్చు. విటమిన్‌ డి లోపం ఉంటే నోటిలో జరిగే కనిపించే ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

* విటమిన్‌ డి లోపంతో బాధపడేవారి పెదవులు, నాలుకపై మండినట్లు అనిపిస్తుంది. కొద్ది రోజులు ఈ సమస్య ఉంటే పెద్దగా టెన్షన్‌ పడాల్సిన పనిలేదు. కానీ ఎంతకీ తగ్గకపోతే మాత్రం కచ్చితంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

* నోటిలో తిమ్మిరిలా అనిపించినా వెంటనే జాగ్రత్తపడలాని నిపుణులు చెబుతున్నారు.

* ఇక నోరు తరుచూ పొడిగా మారుతోన్న విటమిన్‌ డి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. తగినంత నీరు తాగుతోన్నా పొడిగా మారుతుంటే విటమిన్‌ డి పరీక్ష నిర్వహించుకోవాలి.

* నోటిలో నిత్యం దుర్వాసనగా ఉన్నా, ఏదైనా ఆహారం తీసుకునే సమయంలో నొప్పిలా ఉన్నా కూడా విటమిన్‌ డి లోపం వల్లేనని గమనించాలి. ఇలాంటి లక్షణాలు ఏవీ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఒకవేళ విటమిన్‌ డి లోపం ఉన్నట్లు తేలితే వైద్యుల సూచన మేరకు కొన్ని ఔషధాలు వాడాల్సి ఉంటుంది. అయితే మెడిసిన్స్‌ ద్వారా కాకుండా సహజంగా కూడా విటమిన్‌ డి లెవెల్స్‌ పెంచుకోవచ్చు. ఇందులో కోసం రోజూ ఎండలో కొంత సమయమైన గడపాలి. 10 నుంచి 20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల విటమిన్‌ డి ఉత్పత్తి అవుతుంది. ఇక దీంతోపాటు ఆహారంలో పాలకూర, కాలీఫ్లవర్‌, బెండకాయలు, సోయాబీన్‌, చేపలు, పాలు, పుట్ట గొడుగులను భాగం చేసుకుంటే శరీరానికి తగినంత విటమిన్‌ డి లభిస్తుంది.

Also Read: Farm Laws Repealed: ఇది అన్నదాతలు సాధించిన విజయం.. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు

World Record: సరదాగా మొదలు పెట్టిన అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను సొంతం చేసుకున్న ఆరేళ్ళ చిన్నారి.. ఎక్కడంటే

అయినా రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం: రాకేష్ తికాయత్ ప్రకటన