Sleep Less Problems: మారుతోన్నజీవనశైలి, షిప్టుల్లో ఉద్యోగాలు వెరసి చాలా మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఇక కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నిద్రకు దూరమవుతుంటే.. మరికొందరు టెక్నాలజీ పేరుతో విపరీతంగా మొబైల్ ఫోన్లను వాడడం, సోషల్ మీడియాలో విహరిస్తూ.. ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లను చూస్తూ రాత్రంతా మెలుకవతో ఉంటున్నారు. అయితే నిద్రను నిర్లక్ష్యం చేస్తే కలిగే దుష్ఫ్రభావాల గురించి తెలిస్తే మాత్రం. ఇకపై ఆ పని చేయమన్నా చేయరు. ఇంతకీ నిద్రలేమి కారణంగా శరీరంపై పడే దుష్ప్రభావలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* శరీర బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఓ కారణమనే విషయం మీకు తెలుసా.? సరైన నిద్ర లేకపోతే.. శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీని కారణంగా.. మనం తీసుకునే ఆహారం ద్వారా లభించే క్యాలరీలు సరిగ్గా ఖర్చు కావు. దీంతో శరీరంలో కొవ్వు చేరుతుంది. అధికంగా బరువు పెరుగుతారు.
* ఇటీవలి కాలంలో చాలా మందిలో కోపం, విసుగు, ఒత్తిడి పెరుగుతోంది. దీనికి కూడా నిద్రలేమి ప్రధాన కారణమని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
* నిద్రలేమితో సతమతమయ్యే వారు త్వరగా డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయి. నిద్ర సరిగ్గా పోకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా గ్రహించలేదు.ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
* సరైన నిద్రలేకపోతే థైరాయిడ్ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* నిద్రలేమి కారణంగా.. చర్మం పొడిబారుతుంది. జుట్టు రాలుతుంది. ఇతర చర్మ, జుట్టు సమస్యలు వస్తాయి.
Old Age Healthy habits: వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించడానికి అత్యుత్తమ ఆరు అలవాట్లు.. అవేమిటంటే..