AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చిన్న పిల్లల్లోనూ హైబీపీ ప్రమాదం.. ముందుగానే ఎలా గుర్తించాలంటే..

అయితే కేవలం యువకుల్లో మాత్రమే కాకుండా చిన్నారుల్లోనూ బీపీ లక్షణాలు కనిపిస్తుండడం ఇటీవల కలవరపెడుతోంది. చిన్నారుల్లో హైబీపీ బయటపడుతుండడం కలవరపెడుతోంది. చిన్నారుల్లో మొదటి నుంచే హైబీపీ తాలుకూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తిస్తే వెంటనే చికిత్స అందించడం ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ చిన్నారుల్లో...

Health: చిన్న పిల్లల్లోనూ హైబీపీ ప్రమాదం.. ముందుగానే ఎలా గుర్తించాలంటే..
High Bp In Kids
Narender Vaitla
|

Updated on: Oct 22, 2023 | 5:28 PM

Share

మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వస్తున్న మార్పులు.. కారణం ఏదైనా ఇటీవల అధికరక్తపోటుతో ఇబ్బందిపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు హైబీపీ అంటే 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి. నిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవితం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో పాతికేళ్ల కుర్రాళ్లు కూడా రోజూ బీపీ ట్యాబ్లెట్స్‌ వేసుకునే పరిస్థితి వచ్చింది.

అయితే కేవలం యువకుల్లో మాత్రమే కాకుండా చిన్నారుల్లోనూ బీపీ లక్షణాలు కనిపిస్తుండడం ఇటీవల కలవరపెడుతోంది. చిన్నారుల్లో హైబీపీ బయటపడుతుండడం కలవరపెడుతోంది. చిన్నారుల్లో మొదటి నుంచే హైబీపీ తాలుకూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తిస్తే వెంటనే చికిత్స అందించడం ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ చిన్నారుల్లో కనిపించే హైబీపీ లక్షణాలు ఏంటి.? నివారణ మార్గాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నారుల్లో బీపీ రావడానికి కారణం ఏంటి.?

వైద్య నిపుణుల ప్రకారం పిల్లల్లో అధిక రక్తపోటు జన్యుపరమైన సమస్యల కారణంగా వస్తుందని చెబుతున్నారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో హైబీపీ తాలుకూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్యే తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుందిన హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని ప్రాథమిక లక్షణాల ఆధారంగా చిన్నారుల్లో హైబీపీని ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

చిన్నారుల్లో ఉన్నట్లుండి వాంతులు కావడం, హృదయ స్పందనలో పెరుగుదల కనిపించడం, తీవ్రమైన తలనొప్పి వేధించడం, ఉన్నట్లుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకస్మిక చమట వంటి లక్షణాల ఆధారంగా హైబీపీని గుర్తించవచ్చని చెబుతున్నారు. అధిక బరువుతో పుట్టిన చిన్నారులు, గుండె జబ్బులతో జన్మించిన చిన్నారుల్లో హైబీపీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక బలహీనంగా జన్మించిన వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. సమయానికి సరైన చికిత్స అందించకపోతే చిన్నారుల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో చిన్నారుల్లో హార్ట్ స్ట్రోక్‌ రావడానికి ఇదే కారణంగా మారుతుంది.

చిన్నారుల్లో అధిక రక్తపోటు రాకుండా ఉండాలంటే పిల్లల్లో బరువును చిన్నప్పటి నుంచే నియంత్రించాలి. ఇక చిన్నారులకు ఇచ్చే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. వారు తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. ఫాస్ట్‌ ఫుడ్‌, చిప్స్‌, బేకరీ ఐటమ్స్‌ను మితంగా అందించాలి. ఇక చిన్నారులకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వడం తగ్గించి, ఆటలు ఆడించడం నేర్పించాలి. వీలైనంత వరకు శారీరక శ్రమకు ప్రాధాన్యతను ఇవ్వాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..