Causes of Baldness: మగవారిలో బట్టతల రావడానికి కారణాలు ఇవే!

చాలా మంది మగవారిలో ఇబ్బంది పెట్టే సమస్యల్లో బట్టతల కూడా ఒకటి. కేవలం మగవారిలోనే బట్టతల రావడం గమనించే ఉంటారు. కొంత మందికి వయసు దాటాక వస్తే.. మరికొంత మందికి చిన్న వయసులోనే వస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. బట్ట తల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ సమస్యల వల్ల, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ బట్టతల మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బట్టతల కారణంగా చాలా మంది..

Causes of Baldness: మగవారిలో బట్టతల రావడానికి కారణాలు ఇవే!
Baldness

Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 7:06 PM

చాలా మంది మగవారిలో ఇబ్బంది పెట్టే సమస్యల్లో బట్టతల కూడా ఒకటి. కేవలం మగవారిలోనే బట్టతల రావడం గమనించే ఉంటారు. కొంత మందికి వయసు దాటాక వస్తే.. మరికొంత మందికి చిన్న వయసులోనే వస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. బట్ట తల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ సమస్యల వల్ల, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ బట్టతల మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బట్టతల కారణంగా చాలా మంది నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆత్మన్యూనతా భావనకు గురవుతూంటారు. మగవారిలో బట్టతల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిని సరిచేసుకుంటే మాత్రం ఆ సమస్య నుంచి కాస్త బయట పడవచ్చు.

హార్మోన్ల అసమతుల్యత:

బట్టతల రావడానికి వచ్చే కారణాల్లో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కూడా ఒకటి. ముఖ్యంగా అధిక డీహెచ్ టీ పురుషుల బట్టతల రావడానికి ముఖ్య కారణం అవుతుంది. దానికి తోడు థైరాయిడ్, హార్మోన్ల చికిత్సల వంటి వైద్య పరిస్థితుల కారణంగా బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే హార్మోన్ల సమస్యకు సరైన చికిత్స తీసుకుంటే.. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోషకాహార లోపం:

పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలడం ఎక్కువగా ఉటుంది. కాబట్టి విటమిన్లు ఎ, సి, ఇ, డి, ఐరన్, బయోటిన్ వంటివి మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి. దీంతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. కాబట్టి బట్ట తల వచ్చే ప్రమాదం నుంచి బయట పడొచ్చు.

మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్:

కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా జుట్టు రాలి.. బట్ట తల వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిప్రెషన్, క్యాన్సర్, ఆర్థరైటీస్, అధిక రక్త పోటు ఉండి, వాటికి సంబంధించి చికిత్సకు వాడే మెడిసిన్ హెయిర్ రాలేందుకు కారణాలవుతాయి. మీరు మందులు వాడే ముందు.. ఒకసారి జుట్టు రాలే ప్రమాదం గురించి వైద్యులతో సంప్రదించడం మేలు.

వయస్సు:

వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జుట్టు రాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే.. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి:

ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు మ్యూజిక్ వినడం, శ్వాస వ్యాయామాలు చేయడం బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.