Air Pollution: పెరుగుతోన్న వాయు కాలుష్యానికి ఇలా చెక్‌ పెట్టండి.. బెస్ట్ గ్యాడ్జెట్స్‌..

|

Nov 12, 2023 | 5:24 PM

పరిశ్రమలు విపరీతంగా పెరగడం, ఇంధన వినియోగం ఎక్కువ కావడంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అయితే వాయు కాలుష్యం కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర గంటలు మోగుతోన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. వాయు కాలుష్యం బారిన పడకుండా...

Air Pollution: పెరుగుతోన్న వాయు కాలుష్యానికి ఇలా చెక్‌ పెట్టండి.. బెస్ట్ గ్యాడ్జెట్స్‌..
Air Pollution
Follow us on

వాయు కాలుష్యం అంటే ముందుగా గుర్తొచ్చే పట్టణం ఢిల్లీ. అయితే ఇప్పుడు దేశంలోని చాలా నగరాల్లో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రోజురోజుకీ వాయు కాలుష్యం స్థాయిలు పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.

పరిశ్రమలు విపరీతంగా పెరగడం, ఇంధన వినియోగం ఎక్కువ కావడంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అయితే వాయు కాలుష్యం కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర గంటలు మోగుతోన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. వాయు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీకి అనుగుణంగా వాయు కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు కూడా మార్కెట్లోకి గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో గాలిని శుభ్రం చేసుకోవడానికి ఈ గ్యాడ్జెట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయి. గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్‌ చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గాలిలోని విషపూరిత కారకాలను ఫిల్టర్‌ చేసి, మంచి గాలిని అందించే కొన్ని ఎయిర్‌ ప్యూరిఫైర్‌ ప్రొడక్ట్స్‌పై ఓ లుక్కేయండి.. గాలిలోని కాలుష్యాన్ని తగ్గించడంలో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫిలిప్స్‌, సామ్‌సంగ్‌తో పాటు ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ వీటిని రూపొందిస్తున్నాయి.

గాలిలోని కాలుష్యం నుంచి బయటపడడానికి N99/FFP2 మాస్క్‌ కూడా మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఈ మాస్క్‌ను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మాస్క్‌ గాలిలోని మలినాలను ఫిల్టర్‌ చేస్తుంది. దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఇక మీరు పీల్చుతున్న గాలి ఎమేర నాణ్యమైందో కూడా తెలుసుకునే ఎయిర్‌ క్వాలిటీ మానిటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎయిర్‌ క్వాలిటీని తెలుసుకోవచ్చు.

గాలికి తేమను యాడ్‌ చేస్తే గాలి క్వాలిటీని పెంచుకోవచ్చు. హ్యూమిడిఫైయర్లు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. ఇవి గాలి క్వాలిటీని పెంచంతో పాటు, గాలిలోని దుమ్ము ధూళిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఒకవేళ మీరు కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుతుంటే ఈ విషయాన్ని వెంటనే తెలుసుకునే గ్యాడ్జెట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రీతింగ్ ఎనలైజర్‌ ద్వారా మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఈ పరికరం వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ముందు జాగ్రత్త పడొచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..