Health: గుండెను భద్రంగా ఉంచుకోవాలంటే.. మీ మెనులో ఈ ఫ్రూట్స్‌ని తప్పక చేర్చుకోవాల్సిందే..

|

Jul 17, 2022 | 6:30 AM

Health: మారుతోన్న జీవనశైలి, ఆహార విధానాల కారణంగా శరీరంలో చెడు కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో చిన్న తనంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది...

Health: గుండెను భద్రంగా ఉంచుకోవాలంటే.. మీ మెనులో ఈ ఫ్రూట్స్‌ని తప్పక చేర్చుకోవాల్సిందే..
Follow us on

Health: మారుతోన్న జీవనశైలి, ఆహార విధానాల కారణంగా శరీరంలో చెడు కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో చిన్న తనంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌, ఆయిల్‌ ఎక్కువగా ఉపయోగించే ఫ్రైస్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతోంది. దీంతో రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి చివరికీ హార్ట్‌ ఎటాక్‌ వంటి సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే ఇన్ని రోజులుగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించేసి, ఆరోగ్యంగా మారాలంటే కొన్ని రకాల పండ్లను మీ డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫ్రూట్స్‌ ఏంటి.? వాటి వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటంటే..

యాపిల్‌..

చెడు కొవ్వను తగ్గించడంలో యాపిల్ క్రీయాశీలకంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా యాపిల్స్‌లోని పాలీపీనాల్స్‌ శరీరంలోని కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి.

అరటి పండు..

వీటిలో ఉండే ఫైబర్‌, పొటాషియం కొలస్ట్రాల్‌తో పాటు బీపీని తగ్గిస్తుంది. ఫైబర్‌ పుష్కలంగా ఉండే అరటితో రోగ నిరోధక శక్తి మెరుగువుతుంది.

ఇవి కూడా చదవండి

ద్రాక్ష..

ద్రాక్షను తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలను తరిమేస్తుంది. బీపీతో బాధపడేవారు ద్రాక్షను కచ్చితంగా తీసుకోవాలి.

బెర్రీలు..

బ్లాక్‌ బెర్రీ, స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఎల్‌డీఎల్‌ కొలస్ట్రాల్‌, ఆక్సిడైజ్‌డ్‌ కొవ్వుగా మారకుండా ఇవి చూస్తాయి. దీంతో హృద్రోగ సమస్యకు చెక్‌ పడుతుంది.

పైనాపిల్‌..

పైనాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్‌, న్యూట్రియన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపర్చి రక్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవహించేలా చేస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

అవాకాడో..

అవాకాడోలో ఉండే ఒలిక్‌ యాసిడ్‌లు రక్తంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిని సాలాడ్స్‌, సాండ్‌ విచ్‌ల రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన సూచనలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే అందించినవి. వీటినే ప్రామాణికంగా తీసుకోకుండా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు డాక్టర్ల సూచనమేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..