Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ వ్యాయామాలు చేయండి..

|

Oct 22, 2022 | 6:55 AM

మారుతోన్న జీవనం, తీసుకుంటున్న ఆహారం కారణం ఏదైతేనేం ఇటీవల అధిక బరువు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఈ వ్యాయామాలు చేయండి..
Weight Loss Tips
Follow us on

మారుతోన్న జీవనం, తీసుకుంటున్న ఆహారం కారణం ఏదైతేనేం ఇటీవల అధిక బరువు సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రక్తపోటు, షుగర్‌ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు అధిక బరువు ప్రధాన కారణంగా చెబుతుంటారు. దీంతో చాలా మంది డైటింగ్ పేరుతో కడుపును మాడ్చుకుంటారు. అయితే ఓవైపు డైటింగ్‌ను పాటిస్తూనే మరోవైపు వ్యాయామం చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల వ్యాయామాల ద్వారా వీలైనంత త్వరగా నాజుగ్గా మారొచ్చటా.. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటి? వాటి వల్ల శరీరంలో ఎంత శక్తి ఖర్చవుతుంది.? వంటి వివరాలు మీకోసం..

* స్విమ్మింగ్ బెస్ట్‌ ఎక్సర్‌సైజ్‌ అని చెబుతుంటారు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే 180 నుంచి 266 క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శారీరక ధృడత్వం కూడా పెరుగుతుంది.

* అధిక బరవును తగ్గించుకోవడానికి మరొక మార్గం రాక్‌ క్లయింబింగ్‌. దీని ద్వారా కూడా అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. శరీరంలో అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి. శక్తి త్వరగా అయిపోతుంది. దీంతో శారీరక శ్రమ జరిగి చక్కని వ్యాయామం చేసినట్లవుతుంది. ఇటీవల యువతలో రాక్‌ క్లయింబింగ్‌ ఆసక్తి పెరుగుతోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

* జాగింగ్‌ అనేది ఎప్పటికైనా బెస్ట్‌ ఎక్సర్‌సైజ్‌ అని చెప్పొచ్చు. కనీసం 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే సుమారుగా 400 క్యాలరీలు ఖర్చవుతాయి.

* జంపింగ్‌ రోప్స్‌ ద్వారా కూడా చాలా త్వరగా బరువు తగ్గొచ్చు. కేవలం 30 నిమిషాలు జంపింగ్‌ చేయడం వల్ల 300 నుంచి 444 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు.

* బరువు తగ్గడానికి సైక్లింగ్ కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 30 నిమిషాలు సైకిల్‌ తొక్కడం వల్ల 466 క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఎరోబిక్స్‌ చేయడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. 30 నిమిషాలు ఎరోబిక్స్‌ చేస్తే 400 క్యాలరీలను ఖర్చు చేయొచ్చు.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా వైద్యుల సూచనలు తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..