Pregnancy Food: కాబోయే అమ్మ‌లు ఇది మీకోస‌మే.. క‌డుపులో బిడ్డ ప‌దిలంగా ఉండాలంటే చింత కాయలు తినాల్సిందే..

| Edited By: Ravi Kiran

Jan 15, 2022 | 7:09 AM

Pregnancy Food: త‌ల్లి కాబోయే క్ష‌ణాలు ప్ర‌తీ మ‌హిళ జీవితంలో మ‌ధుర క్ష‌ణాలు. అందుకే గ‌ర్భిణీలు త‌మ క‌డుపులో ఉన్న బిడ్డ కోసం అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు న‌చ్చ‌ని ఆహార ప‌దార్థాల‌ను సైతం అలవాటు చేసుకుంటారు. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాల‌ని..

Pregnancy Food: కాబోయే అమ్మ‌లు ఇది మీకోస‌మే.. క‌డుపులో బిడ్డ ప‌దిలంగా ఉండాలంటే చింత కాయలు తినాల్సిందే..
Follow us on

Pregnancy Food: త‌ల్లి కాబోయే క్ష‌ణాలు ప్ర‌తీ మ‌హిళ జీవితంలో మ‌ధుర క్ష‌ణాలు. అందుకే గ‌ర్భిణీలు త‌మ క‌డుపులో ఉన్న బిడ్డ కోసం అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు న‌చ్చ‌ని ఆహార ప‌దార్థాల‌ను సైతం అలవాటు చేసుకుంటారు. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాల‌ని జాగ్ర‌త్త‌లు ప‌డుతుంటారు. ఇక గ‌ర్భిణీలుగా ఉన్న స‌మ‌యంలో పుల్ల‌టి ఆహార ప‌దార్థాలు తినాల‌నిపించ‌డం సాధార‌ణ‌మైన విష‌య‌మే.

వీటిలో ప్ర‌ధానంగా చింతకాయ గురించి చెప్పాలి. ముఖ్యంగా గ్రామాల్లో విరివిగా ల‌భించే ఈ చింత‌కాయ‌లతో గ‌ర్భిణీల‌కు ఎన్నో లాభాలున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.? ఇంత‌కీ చింత‌కాయ‌లు గ‌ర్భిణీల‌కు ఎలాంటి మేలు చేస్తాయ‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* గ‌ర్భిణీలు చింత‌కాయ‌ను లేదా చింత పండును తిన‌డం వ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ నెలలు నిండ‌కుండా జ‌న్మించే ప‌రిస్థితి రాదు. అంతేకాకుండా త‌ల్లులు కూడా జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్ ద‌రి చేర‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు.

* చింతకాయాల్లో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో త‌ల్లులు త‌రుచుగా వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఫ‌లితంగా బిడ్డ‌ల ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది.

* ఇక చింతకాయ‌ల్లో విట‌మిన్ బి3 అధికంగా ఉంటుంది. ఇది క‌డుపులో బిడ్డ ఎదుగుద‌ల‌కు దోహ‌ద ప‌డుతుంది. ముఖ్యంగా బిడ్డ‌, మెద‌డు, జీర్ణ వ్య‌వ‌స్థ‌, మ్యూక‌స్ వంటి అవ‌య‌వాలు స‌రిగా పెరిగేందుకు దోహ‌ద ప‌డ‌తాయి.

* ఇక గ‌ర్భిణీలకు ఉద‌యం లేవ‌గానే వాంతి, వికారం వ‌చ్చిన‌ట్లు భావ‌న క‌లుగుతుంది. అలాంటి వారు కూడా చింత‌కాయ‌లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

* సాధార‌ణంగా గ‌ర్భిణీలు మ‌ల‌బ‌ద్ద‌కం, అధిక బరువు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. ఇలాంటి సమ‌యాల్లో చింత‌కాయ‌లు తీసుకుంటే వీటిలో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని దూరం చేయడంతో పాటు బ‌రువు పెర‌గ‌కుండా ర‌క్షిస్తుంది.

నోట్‌: చింత‌కాయ‌లు గ‌ర్భిణీల‌కు మంచివే అయిన‌ప్ప‌టికీ. ఇది స‌ద‌రు మ‌హిళ‌ల‌ శ‌రీర త‌త్వ్తం, ఆరోగ్య ప‌రిస్థిత‌ల‌పై ఆధారప‌డి ఉంటుంది. కాబ‌ట్టి గ‌ర్భిణీలు చింత‌కాయ‌ను తీసుకునే ముందు తాము రెగ్యుల‌ర్ చెకప్స్ కోసం వెళుతున్న డాక్ట‌ర్‌ను ఓ సారి సంప్ర‌దించి, డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు తీసుకోవ‌డం ఇంకా మంచిది.

Also Read: Viral video: ఎమ్మెల్యే టికెట్‌ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఎస్పీ నాయకుడు.. ఆత్మాహుతి చేసుకుంటానంటూ..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఇక్కడి నుంచి కూడా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు