Health: చెరుకు రసం ఎక్కడ కనిపించినా వెంటనే తాగేయండి.. దాంతో కలిగే లాభాలు అలాంటివి మరి..

Sugarcane Juice Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం లభించే వాటిలో చెరుకు ఒకటి. రోడ్లపై చెరుకు రసం బండ్లు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే మనలో చాలా మంది జ్యూస్‌ అనగానే..

Health: చెరుకు రసం ఎక్కడ కనిపించినా వెంటనే తాగేయండి.. దాంతో కలిగే లాభాలు అలాంటివి మరి..
Sugarcane Juice Benefits
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2022 | 8:14 AM

Sugarcane Juice Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం లభించే వాటిలో చెరుకు ఒకటి. రోడ్లపై చెరుకు రసం బండ్లు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే మనలో చాలా మంది జ్యూస్‌ అనగానే ఏ పైనాపిలో, కర్బూజ తాగుతుంటారు. కొందరు చెరుకు రసం తాగడానికి అస్సలు ఆసక్తి చూపించరు. దాహం వేస్తే కూల్‌ డ్రింక్‌ తాగడానికి చూపించిన ఇంట్రెస్ట్‌ చెరుకు రసం తాగడానికి చూపించరు. అయితే చెరుకు రసంతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఇకపై రోడ్డుపై ఎక్కడ చెరుకు రసం బండి కనిపించినా వెంటనే తాగేస్తారు. దీనికి కారణం ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనలే.

ఒక ఆఫ్‌ లీటర్‌ చెరుకురసంలో 26.56 క్యాలరీల ఎనర్జీ, 27.51 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 0.27 గ్రాముల ప్రోటీన్‌, 11.23 మిల్లిగ్రాముల క్యాల్షియం, 0.37 ఎమ్‌జీ ఐరన్‌, 41.96 ఎమ్‌జీ పొటాషియం, 17.01 ఎమ్‌జీ సోడియం ఉంటుంది. ఇలా పుష్కలమైన ప్రోటీన్లు ఉన్న డ్రింక్‌ను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. మరి క్రమం తప్పకుండా చెరుకు రసాన్ని తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందామా.?

* చెరుకు రసం నిత్యం తాగడం వల్ల మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెట్టొచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్యను కూడా చెరుకు రసం దూరం చేస్తుంది. అలాగే కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా చెరుకు రసాన్ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఆయుర్వేద నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి చెరుకు రసం లివర్‌కు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యం కామెర్ల సమస్యను దరి చేర్చనివ్వదు. లివర్‌ పనితీరును మెరుగు పరుస్తూ శరీరంలో ప్రోటీన్లను బ్యాలెన్స్‌ చేస్తుంది.

* చెరుకు రసం తీసుకోవడం వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఇది మంచి ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. చెరుకు రసంలో ఉండే కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్‌, ఐరన్‌, పొటాషియంలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. డీహైడ్రేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

* ఇందులో ఉండే అల్కలైన్ లక్షణాల కారణంగా యాసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

* చెరుకు రసం తాగడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసనకు కూడా చెక్‌ పెట్టొచ్చు. ఇందులో ఉండే మినరల్స్‌ నోటి దుర్వసను తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్