Foods For Winter: ఈ 6 ఆహార పదార్థాలను తింటే జలుబు సమస్య తగ్గినట్లే.. చలికాలంలో ఇమ్యునిటీ ఫుడ్స్ ఇవే..

|

Nov 24, 2021 | 11:19 AM

చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి

Foods For Winter: ఈ 6 ఆహార పదార్థాలను తింటే జలుబు సమస్య తగ్గినట్లే.. చలికాలంలో ఇమ్యునిటీ ఫుడ్స్ ఇవే..
Healthy Foods
Follow us on

చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి. చలికాలంలో చాలా మంది ఎక్కువగా జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా చల్లటి వాతావరణంలో ఉండడం వలన గొంతు సమస్యలు.. ముక్కు దిబ్బడ, జలుబు చేయడం వంటివి కలుగుతుంటాయి. అలాగే ఈ సీజన్లో అనారోగ్య సమస్యలను నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. ఇక జలుబును తగ్గించుకునేందుకు ప్రతిసారీ సప్లిమెంట్స్ కాకుండా.. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనూ ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

శీతాకాలంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. అనారోగ్య సమస్యలు మాత్మమే కాకుండా.. జుట్టు, చర్మ, సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం వలన కీళ్ల నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయ. ఉసిరి, నెయ్యి, బజ్రా, ఖర్జూరం, బాదం, ఆవాలు, పచ్చి కూరలు మొదలైనవాటి వలన ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. చలికాలంలో జలుబును తగ్గించి వెచ్చగా ఉంచే పదార్థాలు వాల్ నట్స్, బాదంపప్పు. వాల్ నట్స్ వేడిని కలిగిస్తాయి. దీంతో శరీరం వెచ్చగా ఉండడం మాత్రమే కాదు. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరికాయ ఉత్తమ ఔషధం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే జలుబును తగ్గిస్తుంది. ఉసిరికాయను జామ్, ఊరగాయ, మిఠాయి మొదలైన వాటిని తయారు చేసి తీసుకోవచ్చు. కాలుష్యం కారణంగా గొంతులో చిక్కుకున్న ధూళి కణాలను తొలగించడంలో బెల్లం చాలా బాగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరానికి వేడిని ఇస్తుంది. బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. జలుబును తగ్గిస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు శరీరం లోపల చాలా త్వరగా కరిగిపోతుంది. సరైన పరిమాణంలో నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా, పొరలుగా మారకుండా చేస్తుంది.

నెయ్యి రోటీ, అన్నం, కిచడీ మొదలైన వాటితో కలుపుకుని తినవచ్చు. చిలగడదుంపను చలి ప్రభావాన్ని తగ్గించడానికి చలికాలంలో దీన్ని తింటారు. విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి. ఖర్జూరం ముఖ్యంగా గల్ఫ్ దేశంలో చలికాలంలో తింటారు. ఖర్జూరంలో విటమిన్ ఎ, బి పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరంలో మంచి మొత్తంలో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతాయి.

Also Read: Rashmi Gautham: జబర్ధస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ సినిమాలో రష్మీ గౌతమ్ ?..

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..