High Cholesterol: మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే!

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. సరైన లైఫ్‌ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, తినడానికి సరైన సమయం ఉండకపోవడం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. అంతే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఒకటి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు..

High Cholesterol: మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే!
High Cholesterol

Edited By:

Updated on: Jul 14, 2024 | 9:01 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. సరైన లైఫ్‌ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, తినడానికి సరైన సమయం ఉండకపోవడం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. అంతే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఒకటి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్.. మరొకటి గుడ్ కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బ తీస్తే.. గుడ్ కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి పోతుంది. దీని వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళలు ఆరోగ్య పరంగా సరైన కేర్ తీసుకోవాలి.

దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు:

శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే.. అనేక లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలా ఉండవు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుంచి బయట పడటం మంచిది. లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:

శరీరంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతే అనేక సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా గుండెకి, శరీరంలోని ఇతర భాగాలకు రక్త సరఫరా అనేది ఆగిపోతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే.. రక్త ప్రసరణ వ్యవస్థపై ఎక్కువగా దెబ్బ పడుతుంది. గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా కాళ్లల్లో నొప్పులు:

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే స్త్రీల్లో ఎక్కువగా కాళ్ల నొప్పులు అనేవి పెరుగుతాయి. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటంటే.. కొవ్వు పెరిగి పోవడం వలన.. రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అలాగే కాళ్లల్లో రక్త నాళాలు దెబ్బ తింటాయి. అలాగే పాదాల్లో కూడా నొప్పులు విపరీతంగా వస్తాయి. ఎక్కువ సేపు నిలబడలేరు. ఏ పనీ చేయలేరు. ఎక్కువగా చెమటలు కూడా పడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించడం అవసరం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి