Milk with Jaggery: రాత్రి పడుకునే ముందు పాలలో బెల్లం కలిపి తీసుకుంటే చాలా లాభాలు..

|

Dec 05, 2021 | 8:59 PM

ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. పాలు పిల్లలకు ప్రధాన ఆహారం అయితే.. మిగిలిన వారికి ఇది కాల్షియం, ఇతర రకాల పోషకాలకు మూలం. రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే..

Milk with Jaggery: రాత్రి పడుకునే ముందు పాలలో బెల్లం కలిపి తీసుకుంటే చాలా లాభాలు..
Milk With Jaggery
Follow us on

Health Benefits: ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. పాలు పిల్లలకు ప్రధాన ఆహారం అయితే.. మిగిలిన వారికి ఇది కాల్షియం, ఇతర రకాల పోషకాలకు మూలం. రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. చలికాలంలో పాలతోపాటు కాస్త బెల్లం కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చు. అది కూడా శీతాకలంలో ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.

1. చక్కని జీర్ణ శక్తి కోసం..   

పాలతో బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బలపడుతుంది. పాలలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో, రాత్రి పడుకునే ముందు, 1 గ్లాసు గోరువెచ్చని పాలలో చిన్న బెల్లం ముక్క కలపండి.. తాగడండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది.

2. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం

 పాలు, బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో, మీరు చిన్న అల్లం ముక్కను తినాలనుకుంటే చలికాలంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది

మీరు తీసుకునే బెల్లం రసాయన రహితం, ఆర్గానిక్.. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నిత్యం పాలు, బెల్లం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.

4. పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు వేడి పాలలో బెల్లం తీసుకుంటే, మీరు పీరియడ్స్ సమయంలో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో బెల్లం, పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

5. అలసట దూరమవుతుంది

రోజంతా ఇంటిపని, ఆఫీస్ పనులు చేసి అలసటగా అనిపిస్తే, రాత్రి నిద్రలేకపోతే నిద్రపోయే ముందు వేడి పాలల్లో బెల్లం కలిపి తాగాలి. ఇది అలసటను తొలగిస్తుంది. అదే సమయంలో మీకు గాఢ నిద్ర వస్తుంది.

ఇవి కూడా చదవండి: Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..