Health Tips: కొవ్వు పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే చెడు కొలస్ట్రాల్ ప్రతి ఒక్కరికీ హానికరం. శరీరంలో అధిక కొవ్వు ఉండటం వల్ల గుండెపోటు లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అయితే ఆహారం నుంచి వచ్చే ప్రతి కొవ్వు మన ఆరోగ్యానికి హానికరం కాదు. కొన్ని కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని ఆరోగ్యానికి చెడు చేస్తాయి. అయితే ఏది మంచి కొవ్వు, ఏది చెడ్డ కొవ్వు తెలుసుకోవడం ముఖ్యం. కొవ్వులో వాస్తవానికి 3 రకాలు ఉంటాయి. ఒకటి కొవ్వు ఆమ్లాలు, రెండు అసంతృప్త కొవ్వులు, మూడోది సంతృప్త కొవ్వులు. వీటి గురించి తెలుసుకుందాం.
1. కొవ్వు ఆమ్లాలు
కొవ్వు ఆమ్లాలు మీ శరీరానికి హానికరం. వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అధికంగా పెంచుతుంది. మీ గుండెకి చెడు చేస్తుంది. హార్డ్ ఎటాక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారంలో ఈ రకమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
2. అసంతృప్త కొవ్వులు
అసంతృప్త కొవ్వులు మీకు హాని కలిగించవు. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఒకటి పాలీఅన్‌శాచురేటెడ్, రెండోది మోనోఅన్‌శాచురేటెడ్. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కొవ్వులు మాకేరెల్, అవకాడో నది చేపలలో ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వుల నుంచి మీరు ఒమేగా 3 ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలను పొందుతారు. ఇవి మీ శరీరానికి మనస్సుకు చాలా ముఖ్యమైనవి.
3. సంతృప్త కొవ్వు
సంతృప్త కొవ్వు మీ శరీరానికి మంచిది కాదు. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. సంతృప్త కొవ్వులు మొత్తం శరీరంలో కేవలం10% మాత్రమే ఉండాలి. జంతువుల నుంచి లభించే ఆహారంలో ఈ రకం కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తులలో కూడా సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి