
పియర్స్ పండు ఇది పోషకాలు అధికంగా కలిగిన పండు. శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజాలు పియర్స్‌లో సులభంగా లభిస్తాయి. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
పియర్స్‌ను తరచూ ఆహారంలో చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి శరీర కణాలకు రక్షణను అందిస్తుంది. వాతావరణ మార్పులు వల్ల వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొనగల శక్తి పెరుగుతుంది. వైరల్ అటాక్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది.
పియర్స్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను నియంత్రణలో ఉంచుతుంది. పేగుల లోపల పదార్ధాలు సాఫీగా కదిలేందుకు తోడ్పడుతుంది. మలబద్దకం, పొట్టలో ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు బలం చేకూరుతుంది.
ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఉన్నవారికి ఇది సహజ చికిత్సగా పని చేస్తుంది. గుండెకు సంబంధించిన రుగ్మతలు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు పియర్స్ మంచి నివారణ. రోజూ తినే అలవాటు వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వేసవిలో శరీరానికి తేమ తగ్గిపోవడం సహజం. ఇలాంటి సమయంలో పియర్స్ లాంటి నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు ఉపశమనంగా మారతాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మానికి నలుపు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది. నీటి లోపం వల్ల వచ్చే అలసట, మానసిక అలజడి కూడా తగ్గుతుంది.
పియర్స్‌లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పేగులలో ఉన్న బైల్ యాసిడ్స్‌ను శోషించి వాటిని మలంతో కలిసి శరీరంలో నుంచి బయటకు పంపిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలకు ఈ పండు సహజంగా రక్షణగా మారుతుంది.
పియర్స్‌లో ఉండే ఖనిజాలు ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎముకల ఖనిజీకరణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెనోపాజ్ తరువాత మహిళల్లో బోలు ఎముకల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమస్యలను దూరం పెట్టే శక్తి ఈ పండులో ఉంటుంది.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి పియర్స్ మంచి సహాయక పండు. తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి ఇస్తుంది. ఆకలిని కొంతకాలం నశింపజేస్తుంది. ఫలితంగా అధిక ఆహారం తీసుకునే అవకాశం తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)