Super Six Weight Loss Teas: హ్యాపీగా ఈ టీలు తాగండి.. ఫోకస్ పెట్టండి నాజూగ్గా తయారవ్వండి

|

Aug 10, 2023 | 7:40 PM

అధిక బరువు.. ఇప్పుడు ఇది అందరి సమస్య. పనిఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేక.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోవడం వల్ల శరీరంలో కదలిక లేక పెరగకూడని ప్రదేశంలో కొవ్వు పెరిగి లావైపోతున్నారు. దానిని కరిగించుకునేందుకు మళ్లీ నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఆరు రకాల టీ లలో ఏదొక టీ ని రోజుకి 3-4 సార్లు తాగితే అధికబరువుని తగ్గించుకోవచ్చు. మరింకెందుకు లేట్..

Super Six Weight Loss Teas: హ్యాపీగా ఈ టీలు తాగండి.. ఫోకస్ పెట్టండి నాజూగ్గా తయారవ్వండి
Weight Loss Tea
Follow us on

అధిక బరువు.. ఇప్పుడు ఇది అందరి సమస్య. పనిఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేక.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోవడం వల్ల శరీరంలో కదలిక లేక పెరగకూడని ప్రదేశంలో కొవ్వు పెరిగి లావైపోతున్నారు. దానిని కరిగించుకునేందుకు మళ్లీ నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఆరు రకాల టీ లలో ఏదొక టీ ని రోజుకి 3-4 సార్లు తాగితే అధికబరువుని తగ్గించుకోవచ్చు. మరింకెందుకు లేట్.. ఈజీగా తాగేయండి.. నాజూగ్గా తయారవ్వండి.

గ్రీన్ టీ: ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా మంది హెల్త్ కోసమని దీనికే మొగ్గుచూపుతున్నారు. తయారీ కూడా చాలా ఈజీ. 1 టీ స్పూన్ గ్రీన్ టీ ఆకుల్ని కప్పు నీటిలో వేసి మరిగించి.. గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఇలా తాగితే శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.

దాల్చినచెక్క టీ: 2 కప్పుల నీటిలో చిన్న దాల్చినచెక్క ముక్కవేసి బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి.

ఇవి కూడా చదవండి

అల్లం టీ: ఎప్పుడూ మన వంటింట్లో ఉంటూనే ఉంటుంది. మామూలు టీలో కూడా దీనిని వాడుతాం. రెండు కప్పుల నీటిలో అల్లం ముక్కవేసి బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగితే.. బరువు తగ్గుతారు.

పసుపు, దాల్చినచెక్క టీ: ఈ టీ తయారీకి దాల్చినచెక్క పొడి, అల్లం, పసుపు, తేనె తీసుకోవాలి. రెండు కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తురిమిన అల్లం వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని కప్పులోకి వడగట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగాలి.

పుదీనా టీ: రెండు కప్పుల నీటిలో 7-10 పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగితే.. బరువు తగ్గుతారు. ఇలా క్రమంగా కనీసం నెలరోజులైనా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ టీ: టీ తయారు చేసుకునే టీ పొడి ఒక్కటి చాలు. దానితో డికాషన్ తయారు చేసి.. అది గోరువెచ్చగా ఉండగానే తేనే, నిమ్మరసం కలుపుకుని తాగాలి. కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఏదొక టీ ని క్రమం తప్పకుండా తాగితే.. అధిక బరువు తగ్గొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి