Roasted Black Chana: వేయించిన నల్లల శనగలు మీకు గుర్తున్నాయా.. రోజూ ఓ గుప్పెడు శనగలు తింటే సూపర్ బెనిఫిట్స్!

ఇప్పుడంటే అనేక రకాల స్నాక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చాయి కానీ.. ఒకప్పుడైతే మాత్రం వేరు శనగలు, వేయించిన శనగలు, ఉడక బెట్టిన శనగలు, పెసలు, బొబ్బర్లు లాంటివి ఇంట్లోనే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకుని తినేవాళ్లు. పూర్వం అవే స్నాక్స్. ఖాళీ సమయాల్లో నోట్లో అలా ఒక్కొక్కొటి వేసుకుని తినేవారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ అన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిల్లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి..

Roasted Black Chana: వేయించిన నల్లల శనగలు మీకు గుర్తున్నాయా.. రోజూ ఓ గుప్పెడు శనగలు తింటే సూపర్ బెనిఫిట్స్!
Roasted Chana

Edited By:

Updated on: Sep 24, 2023 | 8:43 PM

ఇప్పుడంటే అనేక రకాల స్నాక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చాయి కానీ.. ఒకప్పుడైతే మాత్రం వేరు శనగలు, వేయించిన శనగలు, ఉడక బెట్టిన శనగలు, పెసలు, బొబ్బర్లు లాంటివి ఇంట్లోనే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకుని తినేవాళ్లు. పూర్వం అవే స్నాక్స్. ఖాళీ సమయాల్లో నోట్లో అలా ఒక్కొక్కొటి వేసుకుని తినేవారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ అన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిల్లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఎక్కువగా ఇవి పార్కుల వద్ద రోడ్ కనిపిస్తూ ఉంటాయి. రోజూ కాసిన్ని వేయించిన శనగలను తినడం వల్ల అరుగుదల శక్తితో పాటు ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. ఇంకా వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ లభిస్తుంది:

రోజూ ఓ గుప్పెడు వేయించిన నల్ల శనగలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతంది. దీంతో సీజనల్ అనారోగ్య సమస్యలు, ఇతర వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు ఉండవు:

తరచూ వేయించిన శనగలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో మల బద్ధకం ప్రాబ్లమ్ కూడా ఉండదు.

బరువు నియంత్రణలో ఉంటుంది:

వేయించిన నల్ల శనగల్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఓ గుప్పెడు తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇవి తిన్న వెంటనే ఏ ఆహారం తీసుకోలేము.

రక్త హీనత ఉండదు:

క్రమం తప్పకుండా తరచూ శనగలు తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. ఎందుకంటే వీటిల్లో ఐరన్ ఉంటుంది. దీంతో రక్త హీనత సమస్యలు రావు.. వచ్చినా వీటిని తింటే అదుపులోకి వస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

వేయించిన శనగల్లో ప్రోటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం అనేవి ఉంటాయి. ఇవి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.