Stomach Heat: కడుపులో ఆ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టాండి..

|

Jul 29, 2022 | 6:10 AM

ఉదరం వేడి కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Stomach Heat: కడుపులో ఆ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టాండి..
Stomach Heat
Follow us on

Stomach Heat Causes: ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. తరచుగా మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో వేడిని కలిగి ఉంటారు. ఉదరం వేడి కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మనం ఏదైనా మంచిగా లేని ఆహారం తిన్నప్పుడు కడుపులో వేడి సమస్య వస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కడుపులో యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. అంతేకాకుండా చెమట కూడా అధికంగా పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఉదరంలో వేడి పెరగడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవం మంచిది. దీంతోపాటు ఉదరం వేడి సమస్యను ఎలా వదిలించుకోవాలి.. ఏం చేస్తే తగ్గుతుంది అనే విషయాలను తెలుసుకోండి.

ఇవి తీసుకుంటే కడుపులో వేడి ఎక్కువ అవుతుంది..

  • ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం
  • ఎక్కువ నాన్-వెజ్ ఫుడ్ తినడం
  • ఆల్కహాల్ తాగడం – స్మోకింగ్ చేయడం
  • ఎక్కువ మందులు తీసుకోవడం
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడం
  • ఎక్కువగా టీ తాగడం
  • శరీరంలో నీటి కొరత కారణంగా కడుపులో వేడి కలుగుతుంది

ఈ విధంగా చేస్తే వేడి మటుమాయం..

ఇవి కూడా చదవండి

పుదీనా నీరు: పుదీనా నీరు పొట్టను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కడుపులోని వేడిని కూడా శాంతపరుస్తుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మెడిసినల్ గుణాల వల్ల కడుపులో మంట తగ్గుతుంది.

సోంపు నీరు: సోంపు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపు వేడిని శాంతపరచడంలో సహాయపడుతుంది. మరోవైపు, ప్రతిరోజూ భోజనం తర్వాత సోంపు తీసుకుంటే ఉదరం సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉదయం నిద్రలేవగానే సోంపు నీటిని తాగడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..