ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిఒక్కరిలో ఏదోఒక ఆరోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఒత్తిడి కారణంగానూ చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే చాలా మందిలో శృంగార సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. దాదాపు 50 – 60శాతం మంది పురుషులకు శృంగార సమస్యలు ఉంటున్నాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సమస్యల గురించి చాలా మంది బయటకు చెప్పుకోలేక పోతుంటారు. కొంతమంది ఈ సమస్యలనుంచి బయటపడేందుకు ఏవేవో మందులు వాడుతూ ఉంటారు. కొందరు ఈ సమస్య నుంచి బయట పడినా కొంతమంది బయటపడలేక పోతున్నారు.
ఒక చిన్న టిప్ తో శృంగార సమస్య నుంచి బయటపడొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. ఈ చిన్న టిప్ పురుషుల్లో స్టామినా పెరిగేందుకు ఉపయోగపడుతుందట. శృంగారంలో చురుగ్గా పాల్గొనలేక పోతున్నామని బాధపడేవారు. ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు నీరెండలో ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట వచ్చే ఎండలో సేద తీరడమే సహజసిద్ధ వైద్యమని అంటున్నారు నిపుణులు.
ఉదయం ఎండలో గడిపేవారికి ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు కొందరు పరిశోధకులు. విటమిన్-డి కి స్తంభన సమస్యను నివారించే శక్తి ఉందని, ఇది సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుందని, అందుకే ప్రతి రోజూ ఉదయం సన్‌బాత్ చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. అలాగే ఈ సమస్యతో బాధపడేవారు వ్యాయామం చేస్తూ మంచి డైట్ ఫాలో అయితే కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు.
(పైన ఇచ్చిన వార్తలో నిపుణుల సలహా మాత్రమే ఉంది. అధికారిక సమాచారం కాదు)
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి